జూ పార్క్ లో బెంగాల్ టైగర్ మృతి

29 Apr, 2016 18:49 IST|Sakshi

ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని కరాచీ జూ పార్క్లో బెంగాల్ టైగర్ మృతిచెందినట్టు శుక్రవారం అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. గత కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యానికి గురైన పులికి కిడ్నీ చెడిపోవడంతో మృతిచెందినట్టు జీయో న్యూస్ నివేదించింది. సాధారణంగా పులల జీవితం కాలం 17 నుంచి 18 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ బెంగాల్ టైగర్ 16 ఏళ్లకే మృతిచెందినట్టు జూ డైరెక్టర్ మహమ్మద్ ఫహీమ్ ఖాన్ చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత జూ లో పులి చనిపోవడం ఇది రెండోసారిగా పేర్కొన్నారు.

గత 2014 జూన్ నెలలో బెల్జియం నుంచి తీసుకవచ్చిన చిన్న పులి జీర్ణశయాంతర సంబంధిత సమస్యలతో మృతిచెందినట్టు తెలిపారు. గడిచిన సంవత్సరాల్లో కరాచీ జూలో పులులే కాకుండా నక్కలు, జింకలు, ఒంటెలు వంటి మిగతా జంతు జాతులు క్రమక్రమంగా అంతరించిపోతూ వస్తున్నాయని ఫహీమ్ ఖాన్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు