కావాలని కరోనా అంటించుకుని..

3 Apr, 2020 17:43 IST|Sakshi

బెర్లిన్‌ : ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ పేరు చెబితేనే భయంతో వణకిపోతున్నాయి. ఇలాంటి సమయంలో  జర్మనీ బెర్లిన్‌ జిల్లా మేయర్‌ స్టీఫెన్ వాన్ డాసెల్ మాత్రం కావాలనే కరోనా వైరస్‌ను తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. అయితే తాను ఇలా చేయడం వెనక ఒక బలమైన కారణం ఉందని స్టీఫెన్‌ చెబుతున్నాడు. తన పార్ట్‌నర్‌ నుంచి కరోనా వైరస్‌ సోకేలా చేసుకున్నానని స్టీఫెన్‌ తెలిపారు. కరోనాను తట్టుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని భావించానని.. అందుకోసమే ఇలా చేశానని వెల్లడించాడు. 

అయితే కరోనా వైరస్‌ తాను ఊహించని దానికంటే దారుణంగా ఉందని స్టీఫెన్‌ పేర్కొన్నాడు. తను అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం అనారోగ్యానికి గురైనట్టు వెల్లడించారు. దీనిని ఎవరికి సోకకుండా చూస్తానని అన్నారు. అయితే స్టీఫెన్‌ చేసిన పనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడితే.. మిగతావారికి కూడా కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది వైద్యుల సూచనలకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. 

అయితే స్టీఫెన్‌ మాత్రం తను ప్రపంచం కోసమే ఈ పని చేశానని అంటున్నాడు. తన పార్ట్‌నర్‌కు కరోనా సోకడంతో.. నేను కూడా క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనా ఒకరి నుంచి మరోకరికి సోకుండా నిలువరించలేమని అన్నారు. కరోనా కట్టడి కోసం కృషి​ చేస్తాననని చెప్పారు. బాధ్యత గత వ్యక్తిగా కరోనా నుంచి కోలుకునే వరకు క్వారంటైన్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. 

చదవండి : కరోనా: గంగవరం పోర్టు యాజమాన్యం విరాళం

చేతులెత్తి నమస్కరిస్తున్నా: బాలకృష్ణ

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు