గూఢచర్యం ఎలా చేయాలో చెప్పే బెర్లిన్‌ స్కూళ్లు!

13 Nov, 2019 14:24 IST|Sakshi

బెర్లిన్‌: ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో గూఢచారుల రాజధానిగా పేరొందిన బెర్లిన్‌ నగరంలో కొత్తగా గూఢచార‍్యం ఎలా చేయాలో చెప్పేందుకు.. జర్మనీ దేశ నిఘూ వర్గాలు పాఠశాలలను ప్రారంభిస్తున్నాయి. ఇక తమ స్పై(వేగు) స్కూల్‌లో సైబర్‌దాడులను ఎలా అరికట్టాలో నేర్పించడంతో పాటు హ్యాకింగ్, ఉగ్రమూకలను ఏరి పారేయడం, కెమిస్ట్రీ ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి ఏజెంట్లకు శిక్షణ ఇస్తామని జర్మన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. ఈ క్రమంలోనే సెంటర్ ఫర్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ట్రైనింగ్‌ను గూఢాచార సంస్థల అధిపతులు మంగళవారం అధికారికంగా ప్రారంభించారు.

కాగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీగా విడిపోయిన విషయం తెలిసిందే. ఉద్యోగావకాశాలు, మెరుగైన విద్య కోసం తూర్పు జర్మన్లు 1950-60 మధ్య కాలంలో పశ్చిమ జర్మనీకి వలసపోయారు. అందులో వందలాది మంది ప్రొఫెసర్లు, వైద్యులు, వ్యాపారవేత్తలు ఉండటంతో తూర్పు జర్మనీ ఆర్థిక వ్యవస్థ (బ్రెయిన్‌ డ్రైన్‌) బలహీనపడింది. ఈ క్రమంలో వలసలను కట్టడి చేసేందుకు తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో బెర్లిన్ గోడను నిర్మించింది. 1980లో సోవియట్ ఆధిపత్య ధోరణి పతనం కావడంతో.. తూర్పు జర్మనీలో ఆంక్షలు సడలి రాజకీయ సరళీకరణ ప్రారంభమైంది. దీంతో నవంబర్ 9, 1989 న బెర్లిన్ గోడను కూల్చివేశారు.  ఈ క్రమంలో ఇటీవల బెర్లిన్ గోడ కూలి 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవటంతో అక్కడి ప్రజలు ఘనంగా వేడుకలు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు