తాబేలు వేగం గురించి మనకు తెలిసిందే..

5 Feb, 2016 02:40 IST|Sakshi
తాబేలు వేగం గురించి మనకు తెలిసిందే..

ఎవరైనా మరీ నిదానంగా ఉంటే.. నత్తతోనూ తాబేలుతోనూ పోల్చడం సాధారణమే. అదే విషయాన్ని బెర్టీ దగ్గరంటే మాత్రం దానికి తెగ కోపమొస్తుంది. ఎవరన్నారు.. తాబేళ్లు స్లోగా నడుస్తాయని అంటూ అంతెత్తున లేస్తుంది.. ఎందుకంటే.. వేగానికి సంబంధించి మనకు బోల్ట్ ఎలాగో.. తాబేళ్లకు బెర్టీ అలాగ.
 
 బ్రిటన్‌లోని డర్హాంకు చెందిన బెర్టీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే తాబేలు. గంటకు 0.6 మైళ్ల వేగం దీని సొంతం. బోల్ట్ 100 మీటర్ల పరుగును 9.8 సెకన్లలో ముగించేస్తే.. బెర్టీ అందుకు 6 నిమిషాల సమయం తీసుకుంటుంది. సాధారణ తాబేలుతో పోలిస్తే.. బెర్టీ రెట్టింపు వేగంతో నడుస్తుందట. అందుకే ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే తాబేలుగా బెర్టీ పేరును 2016 గిన్నిస్ బుక్‌లో నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు