‘మా స్నేహం మిగతా దేశాలకు ఆదర్శం’

17 Aug, 2019 18:50 IST|Sakshi

భూటాన్‌లో మోదీకి ఘన స్వాగతం

థింపూ : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పొరుగు దేశం భూటాన్‌ వెళ్లారు. పారో విమనాశ్రయంలో ఆయనకు భూటాన్‌ ప్రధాని లోటే షెరింగ్ ఘనస్వాగతం పలికారు. సిమ్తోఖా జొంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షేరింగ్‌ మాట్లాడుతూ..  నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ‘భారత్‌, భూటాన్‌ దేశాల భౌగోళిక అంశాల్లో భారీ తేడాలున్నప్పటికీ.. నమ్మకాలు, విలువల్లో ఇరు దేశాలు ఒకే దృక్పథంతో ఉంటాయి. రెండు దేశాల మధ్య ఉన్న మితృత్వం పట్ల చాలా ఆనందంగా ఉంది. భారత్‌, భూటాన్‌ స్నేహబంధం మిగతా దేశాలకు ఆదర్శం’ అన్నారు.

దౌత్యపరమైన అంశాల్లో, భూటాన్‌కు ఆర్థికంగా చేయూతనందించడంలో భారత్‌ సాయం ఎన్నడూ మరువలేనిదని చెప్పారు. 5 లక్షల ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న భారత్‌ లక్ష్యానికి భూటాన్‌ తనవంతు తోడ్పాటునందిస్తుందని స్పష్టం చేశారు. ఇండియా తన లక్ష్యాన్ని చేరుకుని తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని ఆకాక్షించారు. ఇదిలాఉండగా.. థింపూ ఎయిర్‌ పోర్టులో దిగిన అనంతరం ప్రధాని మోదీకి సైనిక వందనంతో స్వాగతం పలికారు. ‘సుందర భూటాన్‌లోని ప్రజల నుంచి మరచిపోలేని స్వాగతం లభించింది’అని మోదీ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు