చైనాలో భారీ గోల్డ్‌ స్కామ్‌!

3 Jul, 2020 20:58 IST|Sakshi

బీజింగ్‌: గత దశాబ్ధంలోనే చైనా చరిత్రలో కనివిని ఎరుగని అతి పెద్ద గోల్డ్‌ స్కామ్‌ బయటపడింది. చైనా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి విలువలైన లోహాలను తనఖా పెట్టుకొని భారీ మొత్తంలో సొమ్మును కంపెనీలకు ఇస్లుంటాయి. ఈ క్రమంలోనే కింగోల్డ్‌ జ్యూవెలరీ అనే సంస్థ 14 బ్యాంక్‌ల వద్ద 83 టన్నుల నకిలీ బంగారు కడ్డీలు తాకట్టు పెట్టి 2.8 బిలియన్‌ డాలర్ల రుణాన్ని పొందింది.అయితే ఇవి నకిలీ బంగారు కడ్డీలని తేలింది. ఈ విషయం ఫిబ్రవరిలోనే బయట పడింది. అయితే ఈ బంగారం చైనా ఆ ఏడాది ఉత్పత్తి చేసిన బంగారంలో 22 శాతం, మొత్తం చైనా  వద్ద ఉన్న బంగారంలో ఇది 4.2 శాతంగా  ఉంది. చైనా ఆర్మీలో పనిచేసిన జియా జిహాంగ్ ఈ కింగ్‌ జ్యూవెలరీ సంస్థకు చైర్మన్‌గా పనిచేస్తున్నారు. (భారత్‌కు అనుకూలించే విషయాలివే!)

ఈ ఏడాది ఫిబ్రవరిలో కింగ్‌గోల్డ్ సంస్థ డాంగ్‌గువాన్ ట్రస్ట్ కో. లిమిటెడ్ (చైనీస్ షాడో బ్యాంక్) కు రుణాలు ఎగవేసినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.  తాకట్టు పెట్టిన బంగారు కడ్డీలు పూతపూసిన రాగి మిశ్రమం అని తేలిందని డాంగ్‌గువాన్ ట్రస్ట్ తెలిపింది. ఈ వార్తతో కింగ్‌ జ్యూవెలర్స్‌కు అప్పు ఇచ్చిన వారంతా షాక్‌కు గురయ్యారు. దీంతో చైనా అపకీర్తిపాలైంది. అధికారులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.చైనా భారత్‌ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ('మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం’)

ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం, మార్చి 31, 2020 నాటికి మొత్తం 1,948.30 టన్నుల నిల్వలతో చైనా ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది. అమెరికా 8,134 టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, జర్మనీ, ఇటలీ 3,364 టన్నులు, 2,452 టన్నులు వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచాయి. 642 టన్నుల బంగారు నిల్వలతో టాప్ 10 దేశాల జాబితాలో భారత్ కూడా ప్రవేశించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా