ఇజ్రాయెల్‌తో భారీ రక్షణ ఒప్పందం

8 Apr, 2017 02:28 IST|Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్, భారత్‌ కు మధ్య రెండు బిలియన్  డాలర్ల  విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌లో తయారైన అత్యాధునిక క్షిపణులను భారత్‌కు అందజేయనుంది. ఈమేరకు ఆదేశం అంగీకరిస్తూ ఒప్పందపత్రంపై సంతకం చేసింది.

ఇది ఇజ్రాయెల్‌ రక్షణ పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంగా ఇజ్రాయెల్‌ ఎయిరోస్పేస్‌ పరిశ్రమ (ఐఏఐ) శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ ఒప్పందం ప్రకారం అత్యాధునిక మధ్యతరహా లక్ష్యాలతో పాటు సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల అత్యాధునిక క్షిపణులను భారత ఆర్మీకి అందించనున్నట్లు ఐఏఐ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు