23,000 ఆటంబాంబుల శక్తి!

24 Dec, 2018 05:55 IST|Sakshi
2004 సునామీలో అసంఖ్యాక మృతులు (ఫైల్‌)

2004 సునామీ సృష్టించిన బీభత్సం

మానవచరిత్రలోనే అతిపెద్ద సునామీగా రికార్డు

దాదాపు 2 లక్షల మంది మృత్యువాత

జకార్తా: ఇండోనేసియాలో 2004, డిసెంబర్‌ 26న వచ్చిన సునామీ మానవచరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ దుర్ఘటనలో 14 దేశాలకు చెందిన 2,30,000 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ సునామీ సందర్భంగా హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన ఆటంబాంబుకు 23,000 రెట్లు అధికమైన శక్తి విడుదలైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అప్పట్లో తేల్చింది.

డిసెంబర్‌ 26న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.59 గంటలకు సుమిత్రా ద్వీపం వద్ద సముద్ర గర్భంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ఈ సందర్భంగా రిక్టర్‌ స్కేలుపై 9 శాతం తీవ్రత నమోదైంది. సముద్ర గర్భంలో ఇండియా ప్లేట్, బర్మా ప్లేట్‌ల మధ్య ఘర్షణ ఏర్పడటంతో 1000 కిలోమీటర్ల పొడవు, పది మీటర్ల లోతు మేర చీలిక ఏర్పడింది. దీంతో సముద్రంలో ఒక్కసారిగా నీళ్లు అతిభారీ పరిమాణంలో స్థానభ్రంశం చెందాయి. ఇది జరిగిన కొన్నిగంటల్లోనే తీరంవైపు శక్తిమంతమైన రాకాసి అలలు దూసుకొచ్చాయి.

హిందూ మహాసముద్రంలోని 11 దేశాల్లోని తీర ప్రాంతాలను ఈ అలలు కకావికలం చేశాయి. ఈ సందర్భంగా సముద్ర గర్భంలో భూకంపం ఎంత తీవ్రంగా వచ్చిందంటే సునామీ అలలు దాదాపు 5,000 కి.మీ వరకూ ప్రయాణించి ఆఫ్రికా తీరంలో సైతం తీవ్రనష్టాన్ని కలుగజేశాయి. దీని ప్రభావంతో చాలాచోట్ల అలలు 50 అడుగుల ఎత్తులో తీరాన్ని ముంచెత్తాయి. సాధారణంగా సునామీ వచ్చినప్పుడు ఓ అల తీరాన్ని తాకివెళ్లిన తర్వాత మరో అల వస్తుంది.

ఇలా ఐదు నిమిషాల నుంచి గంట వ్యవధిలో రాకాసి అలలు తీరాన్ని తాకుతూనే ఉంటాయి. ఈ విషయం తెలియని చాలామంది 2004 సునామీ సందర్భంగా మొదటి అల నుంచి తప్పించుకున్నప్పటికీ ప్రాణాలు దక్కించుకోలేకపోయారు.. సునామీ తాకిడికి మాల్దీవుల్లో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన పగడపు దిబ్బలు తుడిచిపెట్టుకుపోయాయి. సునామీ సందర్భంగా భారీగా ప్రాణనష్టం సంభవించినప్పటికీ కొంచెం అవగాహనతో ప్రాణాలు కాపాడుకున్నవారు సైతం ఉన్నారు. 2004 సునామీ సందర్భంగా ఓ విద్యార్థిని థాయ్‌లాండ్‌లోని సముద్రతీరంలో ఉండగా నీళ్లు ఒక్కసారిగా వెనక్కు వెళ్లిపోయాయి.

పాఠశాలలో సునామీపై చెప్పిన పాఠాన్ని గుర్తుకుతెచ్చుకున్న ఆమె తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది. దీంతో వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇక సునామీపై నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌లో ఓ కార్యక్రమాన్ని వీక్షించిన భారతీయుడు సముద్రం వెనక్కి వెళ్లడంతో ఊరి ప్రజలను అప్రమత్తం చేసి 1,500 మందిని కాపాడగలిగాడు. ఈ ప్రకృతి విపత్తు సందర్భంగా చాలా జంతువులు తీరానికి దూరంగా ఎత్తైన ప్రాంతానికి పారిపోవడాన్ని తాము చూసినట్లు చాలామంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫైనల్లో పరాజితులు లేరు 

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

కుక్క మాంసం తినొద్దు ప్లీజ్‌!

డర్టీ కారు పార్క్‌ చేస్తే రూ. 9 వేలు ఫైన్‌!

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!

పెళ్లికి ఇదేమీ ‘ఆహ్వానం’ బాబోయ్‌!

విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు

టర్కీ చేరిన రష్యా ఎస్‌–400 క్షిపణులు

దారిద్య్రం నుంచి విముక్తి చెందారు

యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!