ప్రపంచంలోనే అతి పెద్ద దోమ..??

4 May, 2018 11:31 IST|Sakshi
ప్రపంచంలోనే అతి పెద్ద దోమ

సిచువాన్‌ ప్రావిన్సు, చైనా : దోమతో కుట్టించుకోవాలని ఎవరికీ ఉండదు. చాలా చిన్నసైజులో ఉన్న దోమ కుడితేనే చాలా ఫీల్‌ అవుతాం. అదే అరచేతి కంటే పెద్ద సైజులో ఉన్న దోమ కాటు వేస్తే పరిస్థితి ఏంటి?. సగటు దోమ సైజు కంటే 10 రెట్లు భారీ సైజులో ఉన్న దోమను చైనాలోని సిచువాన్‌ ప్రావిన్సులో నిపుణులు గుర్తించారు.

భారీ సైజులో ఉన్న ఈ దోమ జపాన్‌కు హలోరుసియా మికాడో అనే జాతికి చెందినదని చెప్పారు. సాధారణంగా ఈ జాతి దోమలు 8 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయని, కానీ ఈ దోమ మాత్రం 11.15 సెంటీమీటర్లు ఉందని తెలిపారు. తొలిసారి దీన్ని గుర్తించినప్పుడు ఆశ్చర్యానికి గురైనట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద దోమగా దీన్ని భావిస్తున్నట్లు చెప్పారు.

మంచి విషయం ఏంటంటే ఈ దోమ ఎవ్వరిని కుట్టదని చెప్పారు. లార్వాలపై ఆధారపడి శరీరాన్ని పోషక పదార్థాలను తయారు చేసుకుంటుందని వివరించారు. భారీ సైజులో ఉండే దోమ జీవిత కాలం కేవలం ఏడు రోజులు మాత్రమేనని వివరించారు.

మరిన్ని వార్తలు