బిల్‌గేట్స్‌ ముచ్చటపడ్డ వస్తువు ఖరీదు రూ. 4600కోట్లు

10 Feb, 2020 17:25 IST|Sakshi

ప్రపంచంలోనే సంపన్నుడు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఓ విలాసవంతమైన యాట్‌(విహార నౌక)ను కొన్నారు. గతేడాది మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో గేట్స్ దీన్ని చూసి ముచ్చట పడ్డారు. పర్యావరణానికి ఈ యాట్‌ ఏ మాత్రం హాని చేయదని తెలుసుకున్న బిల్‌గేట్స్‌ తన కోసం ప్రత్యేకించి రూపొందించుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. వెంటనే దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని చెల్లించి పనులు ప్రారంభించాలని సూచించారు. కాగా.. ఈ నౌక విశేషాలు: ఆక్వా నౌక 370 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో నాలుగు గెస్ట్‌ రూమ్‌లు, రెండు వీఐపీ గదులు, యజమాని రూమ్‌ ఉంటుంది. ఇందులో 5 డెక్‌లు ఉంటాయి. 14 మంది అతిథులు, 31 మంది సిబ్బంది ఈ బోట్‌లో వెళ్లవచ్చు. అలాగే ఒక జిమ్‌, యోగా స్టూడియో, బ్యూటీ రూం, మసాజ్‌ పార్లర్‌, స్విమ్మింగ్‌ పూల్‌ తదితర సదుపాయాలు ఈ బోట్‌లో ఉన్నాయి.

కాగా ఈ బోట్‌ను బిల్‌గేట్స్‌ తరచూ వెకేషన్‌కు వెళ్లేందుకు గాను కొనుగోలు చేశారు. ఈ పడవ లిక్విడ్‌ హైడ్రోజన్‌తో నడుస్తుంది. అంటే కేవలం నీటిని మాత్రమే ఇది వ్యర్థంగా బయటకు వదులుతుంది. ఇక ఈ బోటు ధర రూ.4600 కోట్లు కావడం విశేషం. కాగా లిక్విడ్‌ హైడ్రోజన్‌తో నడిచే ప్రపంచంలోని ఏకైక బోటు కూడా ఇదే కావడం మరో విశేషం. బిల్‌గేట్స్‌ కొనుగోలు చేసిన సూపర్‌యాచ్‌ పొడవు 370 అడుగులు. దీంట్లో ఒకసారి ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. నౌక వేగం గంటకు 17 నాటికల్‌ మైళ్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఎంతో విలాసవంతంగా, ఆధునిక టెక్నాలజీ సాయంతో నడిచే ఈ నౌకలో బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న బోట్లు కూడా ఉంటాయి. కాగా ఇప్పటి వరకూ బిల్ గేట్స్‌కు సొంత విహార నౌక లేదు. ప్రస్తుతం ఈ నౌక తయారీ దశలో ఉంది. ఇది 2024 నాటికి బిల్‌గేట్స్‌ చేతికి రానుంది.

మరిన్ని వార్తలు