చట్టసభ ముందుకు హెచ్‌1బీ వీసా బిల్లు

5 Jan, 2017 17:43 IST|Sakshi
చట్టసభ ముందుకు హెచ్‌1బీ వీసా బిల్లు

వాషింగ్టన్‌: హెచ్‌1బీ వీసా ప్రొగ్రామ్‌ లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును మరోసారి అమెరికా చట్టసభ(కాంగ్రెస్‌)లో ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు ఈ బిల్లును సభ ముందుకు తెచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే హెచ్‌1బీ వీసా ప్రొగ్రామ్‌ లో ఉల్లంఘనలకు కళ్లెం పడుతుందని ఇద్దరు సభ్యులు డారెల్‌ ఇసా, స్కాట్‌ పీటర్స్ అభిప్రాయపడ్డారు. అమెరికన్ల ఉద్యోగాలకు ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందన్నారు.

హెచ్‌1బీ వీసా ఉన్నవారికి వారిక వేతనం కనీసం 10 లక్షల డాలర్లకు పెంచడం, మాస్టర్‌ డిగ్రీ మినహాయింపు రద్దు చేయడం లాంటి కీలక ప్రతిపాదనలు బిల్లులో ఉన్నాయి. విదేశీ ఉద్యోగుల స్థానే అమెరికన్లను అవకాశాలపై బిల్లులో దృష్టి సారించారు. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడేందుకు విదేశీయుల ఉద్యోగ నిబంధనల్లో మార్పలు చేస్తామని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో బిల్లు మరోసారి కాంగ్రెస్‌ ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.