'ఆ డిబేట్ కిచెన్ టేబుల్ నుండే మొదలౌతుంది'

18 Jan, 2016 14:18 IST|Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రటిక్ పార్టీ తరపున ముందున్న హిల్లరీ క్లింటన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం లోవాలో డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్సియల్ డిబేట్లో పాల్గొన్న ఆమె.. రానున్న ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే తన భర్త బిల్ క్లింటన్ సలహాలు సూచనలు తనకు ఎంతగానో ఉపయోగపడుతాయని అంది. అయితే పాలనకు సంబంధించిన ఆ డిబేట్ కిచెన్ టేబుల్ నుండే మొదలౌతుంది అని సరదాగా వ్యాఖ్యానించారు.

గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బిల్ క్లింటన్ అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు హిల్లరీ వెల్లడించారు. 'నాకున్న బెస్ట్ సలహాదారుడు బిల్. 1990 లలో అమెరికా పౌరుల ఆర్థిక పరిస్థితి మెరుగవడంలో అతని పాత్ర ఎంతో ఉంది. నేను తప్పకుండా బిల్ సలహాలు తీసుకుంటాను' అని హిల్లరీ తెలిపారు. అమెరికా ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉందని తెలిపిన ఆమె.. ముఖ్యంగా పేద ప్రజలు స్వతహాగా అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు