పక్షుల రాగాలతో ఒత్తిడి మాయం

26 Feb, 2017 17:10 IST|Sakshi
పక్షుల రాగాలతో ఒత్తిడి మాయం

లండన్ ‌: పక్షుల కిల కిల రాగాలు వింటే మానసిక ఆందోళన, ఒత్తిడి మాయమవుతాయని లండన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్సెటర్‌ యూనివర్సిటీ, ఆర్నిథాలజీ బ్రిటిష్‌ సంస్థ, క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన ఓ పరిశోధనలో పక్షులతో మానసిక ప్రశాంతత పొందవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయోసైన్స్‌ జర్నల్‌ ప్రచురించింది.

ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో పక్షులను చూసిన వ్యక్తుల్లో నిరాశ, మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు, పక్షులు ఉన్న చోట నివసించే వారిని.. చెట్లు, పక్షలు లేని ప్రాంతాల్లో నివసించేవారిని రెండు భాగాలుగా విభజించి పరిశోధనలు జరిపినట్లు జర్నల్‌లో పేర్కొన్నారు. వీరిలో పక్షులను చూసే వారిలో మానసిక ఆందోళనలు తగ్గడం గమనించామని తెలిపారు.

ఈ పరిశోధన ద్వారా ప్రకృతి మానవ మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయం గ్రహించామని పరిశోధకుడు డానియల్‌ కాక్స్‌ చెప్పారు. ఇంటి ప్రాంగణంలో చెట్లు, పక్షులు ఉండటం వలన ఆరోగ్యంగా ఉండవచ్చని..అందుకు చెట్లను పెంచాలని సూచించారు. పక్షులను చూస్తే ప్రశాంతమైన అనుభూతి కలుగుతుందని కాక్స్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు