ఆన్‌ లైన్‌ యాడ్‌.. సోషల్‌ మీడియాలో చిచ్చు

9 Jan, 2018 10:25 IST|Sakshi

వాషింగ‍్టన్‌ : ‘‘కూలెస్ట్‌ మంకీ ఇన్‌ ది జంగిల్‌’’ అంటూ ఓ ఆన్‌లైన్‌ కంపెనీ ఇచ్చిన యాడ్‌ తీవ్ర దుమారం రేపుతోంది. నల్ల జాతీయులను కించపరిచేలా ఉన్న ఆ యాడ్‌పై సదరు కంపెనీ నుంచి క్షమాపణలు డిమాండ్‌ చేస్తూ నల్లజాతీయుల ఫోరమ్‌ నిరసన చేపట్టింది.

స్వీడిష్‌ దుస్తుల కంపెనీ ఒకటి బ్రిటన్‌లో తమ అమ్మకాల కోసం ఆన్‌ లైన్‌ అమ్మకాల సంస్థ హెచ్‌ అండ్‌ ఎమ్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో వారు ఓ యాడ్‌ పోస్టు చేశారు. అందులో ఓ నల్ల జాతికి చెందిన బాలుడి స్వెటర్‌పై మంకీ అంటూ వ్యాఖ్యను పేర్కొంది. పక్కనే శ్వేత జాతికి చెందిన పిల్లాడి ఫోటోను ఉంచి.. అతని స్వెటర్‌పై పులి ఫోటోతో శ్వేత జాతీయులు గొప్పవారు అని అర్థం వచ్చేలా మరో వ్యాఖ్య చేసింది.   అంతే సోషల్‌ మీడియాలో అంతా ఆ కంపెనీ యాడ్‌పై భగ్గుమన్నారు. 

ఇది జాతి వివక్షతేనన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుందంటూ హాలీవుడ్‌ సెలబ్రిటీలు, పాత్రికేయులు, ఉద్యమకారులు హెచ్‌అండ్‌ఎమ్‌ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  న్యూ యార్క్‌ టైమ్స్‌ కాలమిస్ట్‌ హెచ్‌ అండ్‌ ఎమ్‌ కి మతి పోయిందటూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. మరికొందరు హెచ్‌ అండ్‌ ఎమ్‌కు మద్దతుగా పోస్టులు చేయటంతో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున్న వివాదాలు చోటు చేసుకున్నారు. ఇక నల్ల జాతీయుల ఫోరమ్‌ వ్యతిరేక ఉద్యమం చేపట్టడంతో ఆ ప్రభావం కారణంగా హెచ్‌ అండ్‌ ఎమ్‌ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఎట్టకేలకు సదరు దిగ్గజ సంస్థ దిగొచ్చింది.

క్షమించండి.. 

‘‘ఈ ఫోటో కారణంగా చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని అర్థమైంది. ఇందుకు మేం పశ్చాత్తాపం తెలియజేస్తూ క్షమించమని కోరుతున్నాం. మా ఛానెల్స్‌ నుంచి ఈ ఫోటోను తీసేస్తున్నాం’’ అని హెచ్‌ అండ్‌ ఎమ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.  కాగా, గతంలో డోవ్‌ సంస్థ కూడా ఓ యాడ్‌తో జాతి వివక్ష విమర్శలు ఎదుర్కొని క్షమాపణలు తెలియజేసింది. 

మరిన్ని వార్తలు