ఆ వజ్రం వెల.. రూ. 284 కోట్లు

12 Nov, 2015 09:10 IST|Sakshi
ఆ వజ్రం వెల.. రూ. 284 కోట్లు

అది చాలా అరుదైన 12.03 క్యారెట్ల వజ్రం. దాని పేరు 'బ్లూ మూన్'. జెనీవాలోని సోత్‌బీ వేలం శాలలో దీన్ని వేలానికి పెట్టగా.. ఏకంగా రూ. 284 కోట్ల ధర పలికింది. ఈ విషయాన్ని సోత్‌బీ ప్రతినిధి ఒకరు తెలిపారు. క్యారట్ వారీగా చూసుకుంటే వజ్రాలకు ఇప్పటివరకు పలికిన అత్యంత ఎక్కువ ధర ఇదేనని చెబుతున్నారు.

ఒక్క లోపం కూడా లేని ఈ వజ్రానికి ఇంత ధర రావడం సహజమేనని సోత్‌బీ అంతర్జాతీయ నగల విభాగం అధిపతి డేవిడ్ బెన్నెట్ అన్నారు. తాము మాత్రం దీనికి 231-363 కోట్ల మధ్యలో ఏదో ఒక ధర పలుకుతుందని అనుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు