శరీర దుర్వాసనను గుర్తించే యాప్

25 Apr, 2016 01:27 IST|Sakshi
శరీర దుర్వాసనను గుర్తించే యాప్

న్యూయార్క్: సాధారణంగా మన శరీరం నుంచి వచ్చే దుర్వాసనను, చెమట కంపును మనం గుర్తించలేం. ఆ వాసనకు మన ముక్కు అలవాటుపడటమే అందుకు కారణం. దీంతో చుట్టుపక్కలవారు ఇబ్బంది పడుతుంటారు. ఈసమస్యను తీర్చే యాప్‌ను చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారుచేసే సంస్థ నివియా తయారు చేసింది. ‘నోస్’ అనే పేరున్న ఆ యాప్ మన శరీర దుర్వాసనను గుర్తించి మనల్ని హెచ్చరిస్తుంది.యాప్‌ను మరింత పరీక్షించి, త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు