బోఫోర్స్ ప్రధాన నిందితుడు ఖత్రోచి మృతి

13 Jul, 2013 22:21 IST|Sakshi

ఇటలీ: బోఫోర్స్ ఆయుధాల కుంభకోణం ప్రధాన నిందితుడు ఖత్రోచి శనివారం సాయంత్రం మృతి చెందాడు. ప్రస్తుతం మిలాన్‌లో ఉన్న ఖత్రోచికి అకస్మికంగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. 1990లో బోఫార్స్ కుంభకోణం సంబంధించి కేసును సీబీఐ నమోదు చేయగా, దర్యాప్తును చేపట్టేందుకు సీబీఐ ప్రత్యేక బృందం 1999లో మలేషియాకు వెళ్లింది.

గతంలో ఖత్రోచిని భారత్‌కు రప్పించేందుకు సాగించిన ప్రయత్నాలు విఫలమైయ్యాయి. 2011, మే 4వ తేదీన అతనిపై కేసును సీబీఐ ఉపసంహరించుకుంది. బోఫోర్స్ కుంభకోణంకు సంబంధించి ఖత్రోచి దశాబ్దాలపాటు విదేశాల్లో తలదాచుకున్నాడు. ఖత్రోచిపై నేరాభియోగాల్ని ఉపసంహరించుకునేందుకు సీబీఐ సిద్ధమవుతున్న తరుణంలో అతను మృతి చెందాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీలతో ఖత్రోచికి తత్సబంధాలున్నాయి.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు