బొలీవియా అధ్య‌క్షురాలికి పాజిటివ్‌

10 Jul, 2020 08:16 IST|Sakshi

లాపాజ్‌: బొలీవియా తాత్కాలిక అధ్య‌క్షురాలు జీనిన్ అనెజ్‌ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ఆమె త‌నకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని గురువారం ప్ర‌క‌టించారు. అయితే ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ఐసోలేష‌న్‌లో ఉండి ప‌ని చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆమె మంత్రివ‌ర్గంలోని న‌లుగురికి కూడా ఈ మ‌ధ్యే పాజిటివ్ అని వ‌చ్చింది. దీంతో ఆమె ప‌రీక్ష‌లు చేసుకోగా త‌న‌కు కూడా వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. దీంతో అమెరికాలో క‌రోనా బారిన ప‌డ్డ దేశాధ్య‌క్షుల సంఖ్య రెండుకు చేరింది. (జుట్టు కత్తిరించి.. ఈడ్చుకెళ్తూ..)

ఇంత‌కుముందు బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో తన‌కు క‌రోనా సోకింద‌ని మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. మ‌రోవైపు లాటిన్ అమెరికాలోని వెనిజులా రాజ్యాంగ అసెంబ్లీ అధ్య‌క్షుడు డియోస్‌డాడో కాబెల్లో సైతం క‌రోనా కోర‌ల్లో చిక్కుకున్నారు. ఆ దేశ అధ్య‌క్షుడు నికోల‌స్ మాడ్యురో త‌ర్వాత అత్యంత శ‌క్తివంమైన వ్య‌క్తిగా కాబెల్లో గుర్తింపు పొందారు. కాగా 11 మిలియ‌న్ల జ‌నాభా ఉన్న‌ బొలీవియాలో సెప్టెంబ‌ర్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్కడ ఇప్ప‌టివ‌ర‌కు 43 వేల క‌రోనా కేసులు వెలుగు చూడ‌గా 1500 మంది మ‌ర‌ణించారు. (దేశాధ్య‌క్షుడైనా మాస్కు ధ‌రించాల్సిందే: కోర్టు)

మరిన్ని వార్తలు