విమానానికి బాంబు బెదిరింపు.. రక్షణగా ‘ఫైటర్లు’

6 Jul, 2016 01:31 IST|Sakshi

టెల్ అవీవ్ : న్యూయార్క్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళుతున్న ఈఎల్ ఏఎల్ ప్యాసింజర్ విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది.  వెంటనే ఆ విమానానికి రక్షణగా స్విట్జర్లాండ్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలను మోహరించారు.  విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, బాంబు బెదిరింపు తప్పుడు సమాచారమని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు