బ్రిటన్‌ నూతన ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌

23 Jul, 2019 17:00 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ నూతన ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ (55) ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ మంగళవారం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. కాగా బ్రెగ్జిట్‌ ఒప్పందం విషయంలో మాజీ ప్రధాని థెరిసా మేకి  పలుమార్లు ఎదురుదెబ్బలు తగలడంతో ఆమె పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో నూతన ప్రధానని ఎన్నుకున్నారు. దీని కోసం కేంద్రమంత్రుల నుంచి విపరీతమైన పోటీ నెలకొనడంతో రహస్య ఓటింగ్‌ పద్దతి జరపగా.. దానిలో బోరిస్‌ జాన్సన్‌ విజయం సాధించారు. బ్రిటన్‌ ప్రధానిగా పదవీ బాధ్యతలు బుధవారం మధ్యాహ్నాం చేపట్టనున్నారు. గతంలో ఆయన విదేశాంగ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. కాగా నూతన ప్రధాని జాన్సన్‌ కూడా బ్రెగ్జిట్‌కు తొలినుంచి అనుకూలంగా ఉన్నారు. మే కూడా మొదటి నుంచి ఆయనకే మద్దతు ప్రకటిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.  జాన్సన్‌ 2001 నుంచి బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యునిగా కొనసాగుతూ వస్తున్నారు. 

మరిన్ని వార్తలు