ఈ మద్యం బాటిల్‌ రూ.26లక్షలు రాబట్టింది

21 Jul, 2017 15:58 IST|Sakshi
ఈ మద్యం బాటిల్‌ రూ.26లక్షలు రాబట్టింది

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ ఆరవై ఏళ్ల కిందటి రెడ్‌ వైన్‌ మద్యం బాటిల్‌ భారీ మొత్తాన్ని రాబట్టింది. పెన్‌పోల్డ్స్‌ కంపెనీకి చెందిన 1951నాటి ఈ బాటిల్‌ ఆస్ట్రేలియాలో దాదాపు రూ.26,26,905(40,825 డాలర్ల)కు అమ్ముడుపోయింది. దీంతో ఆస్ట్రేలియాలోనే అత్యధిక  మొత్తానికి అమ్ముడుపోయిన అలనాటి వైన్‌ బాటిల్‌గా నిలిచింది. 1844 నుంచి పెన్‌ఫోల్డ్స్‌ సంస్థ వైన్స్‌ను ఉత్పత్తి చేస్తోంది.

అయితే, 1951నాటి వైన్‌ బాటిల్స్‌ను దాచి పెట్టి ఉంచిన ఆ సంస్థ తాజాగా ఒక బాటిల్‌ను వేలానికి పెట్టింది. 1951నాటి పెన్‌ఫోల్డ్స్‌ బాటిల్స్‌ ఒక 20 వరకే ఉన్నాయని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్‌గా దీనిని తాము భావిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఆస్ట్రేలియాలో అతి ప్రఖ్యాతిగాంచిన వైన్‌ కూడా ఇదే.

మరిన్ని వార్తలు