దేవుడి ఫొటోలతో బాత్రూం రగ్స్‌, డోర్‌మ్యాట్లు

12 Jan, 2020 10:34 IST|Sakshi

సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టిల్లు భారతదేశం. అలాంటిది హిందువులు ఎంతో ఆరాధనగా పూజించే దేవుళ్ల చిత్రాలను కాలి కింద వేసుకునే రగ్గులపై ముద్రించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రముఖ ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌. దీంతో భారత వినియోగదారులు అమెజాన్‌ సంస్థపై ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు. దీని పర్యవసానంగా ప్రస్తుతం ట్విటర్‌లో బాయ్‌కాట్‌ అమెజాన్‌ అనేది ట్రెండింగ్‌లో నిలిచింది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో వినాయకుడు, శివుడు, ఓంకారం గుర్తులతో డోర్‌మ్యాట్లు, బాత్రూం రగ్స్‌ దర్శనమిచ్చాయి. వీటితోపాటు భారత జాతీయ జెండాతో కూడిన డోర్‌మ్యాట్స్‌ కనిపించాయి. దీంతో షాక్‌కు గురైన భారతీయులు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని, భారత్‌ను అవమానిస్తున్నారంటూ అమెజాన్‌పై నిప్పులు చెరిగారు.

‘సంస్కృతిని గౌరవించడం తెలీకపోయినా అవమానించడం మానుకోండి’ అని నెటిజన్లు ఘాటుగా విమర్శించారు. మన సంస్కృతిని కించపరుస్తున్న అమెజాన్‌ను బహిష్కరిద్దాం అని పిలుపునిచ్చారు. దీంతో ట్విటర్‌లో ప్రస్తుతం #BoycottAmazon అనేది ట్రెండింగ్‌గా నిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అమెజాన్‌ తాజాగా వివాదానికి కారణమైన వస్తువులను వెబ్‌సైట్‌ నుంచి తొలగింది. కాగా అమెజాన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవుని ఫొటోలు, జాతీయ జెండాను ముద్రించిన డోర్‌మ్యాట్స్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ వై–ఫై కాలింగ్‌ సేవలు

టాటాలకు ‘సుప్రీం’ ఊరట

పరిశ్రమలు మళ్లీ ‘ప్లస్‌’లోకి..

యస్‌లో పరిస్థితులు బాలేవు

వాహన రంగానికి ఎదురుదెబ్బ

సినిమా

వివాదాల 'దర్బార్‌'

త్రిష పరమపదంకు టైమ్‌ వచ్చింది

వారి మనసును దోచడానికి గ్లామర్‌ అవసరం

మళ్లీ గ్యాప్‌ రాకుండా ఈ గ్యాప్‌ ఉపయోగపడింది

ఈ నెల నాకు ట్రిపుల్‌ ధమాకా

ప్రభాస్‌ కొత్త సినిమా ‘జాన్‌’ కాదా?