‘కరోనా మరణాల సంఖ్య తారుమారు’

28 Mar, 2020 14:30 IST|Sakshi
జెయిర్‌ బొల్సోనారో

బ్రెసిలియ: కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం కంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకే అధ్యక్షుడు జెయిర్‌ బొల్సోనారో మొగ్గు చూపుతున్నారని బ్రెజిల్‌లోని పలు రాష్ట్రాల గవర్నర్‌లు ఆయనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ల ఆరోపణలపై బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సోనారో స్పందిస్తూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేశ ఆర్థిక రాజధాని సావోపాలోలోని కరోనా వైరస్‌ మరణాల సంఖ్యను తారుమారు చేశారని మండిపడ్డారు. అంతేగాక అక్కడ మరణాల సంఖ్యపై తనకు సందేహం ఉందని కూడా ఆరోపించారు. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం)

కాగా కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి ప్రజా వైద్య ఆరోగ్య సంస్థ సూచనల మేరకు బ్రెజిల్‌లోని 26 రాష్ట్రాల గవర్నర్‌లు అనవసరమైన వాణిజ్య కార్యకలాపాల సేవలను నిషేధించారు. దీంతో ఆ దేశ ఆధ్యక్షుడు బోల్సోనారో దీనిపై ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. ‘దేశ ఆర్థిక రాజధాని అయిన సావోపాలోలో మరణించే వారిని మనం కాపాడలేనప్పుడు.. వారిని చనిపోనివ్వండి. ట్రాఫిక్‌ వల్ల కారు ప్రమాదం జరిగితే ఏకంగా కార్ల తయారి కర్మాగారాన్ని మూసి వేయలేం కదా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక సావోపాలోలో మరణాల సంఖ్య అధికంగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌ వల్ల శుక్రవారం నాటికి అక్కడ 1,223 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 68 మంది మరణించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం అక్కడి పరిస్థితుల తీవ్రతను మనం గమనించాలి. కానీ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునే సమయం ఇది కాదు’ అంటూ మండిపడ్డారు. (కరోనా: ఊపిరితిత్తులు ఎంతగా నాశనమయ్యాయో..)

కరోనా వ్యాప్తికి తీసుకుంటున్న చర్యలు...
ఇతర దేశస్థులు తమ దేశంలో ప్రవేశించకుండా విమానాశ్రయ సేవలను బ్రెజిల్‌ న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం నిలిపివేసింది. దీనిని సోమవారం నుంచి అమలు చేయలనున్నట్లు అధికారులు తెలిపారు. దీనితో పాటు ఇతర దక్షిణ అమెరికా దేశాలల్లో కూడా ఈ చర్యలను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం కూడా బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ ఇతర దేశాలలో 'క్వాంటిటేటివ్ సడలింపు' విధానాలకు అనుగుణంగా అత్యవసర బాండ్-కొనుగోలకు అధికారాలు పిలుపునిచ్చారు. అదే సమయంలో పేరోల్‌తో  చిన్న కంపెనీలకు సహాయం చేయడానికి 40 బిలియన్ల రీయిస్ క్రెడిట్ లైన్‌ను ఆవిష్కరించింది.

అలాగే 3 నెలల లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వయం ఉపాధి, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం తరపున రూ. 45 బిలియన్ల రీయిస్‌లను అందిస్తుందని, ఇలా మూడు నెలల పాటు మొత్తం రూ. 700 బిలియన్ల రీయిస్‌లను ఇవ్వనున్నట్లు సావోపాలో ఆర్థిక మంత్రి పాలో గూడెస్ శుక్రవారం ప్రకటించించారు. అంతేగాక దేశ వ్యాప్తంగా సోమవారం నాటికి కరోనావైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,891 నమోదు కాగా, మరణాలు 92కి చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు