బోల్సొనారోకు మూడోసారి కరోనా పాజిటివ్‌

22 Jul, 2020 20:08 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

జైర్‌ బోల్సొనారోను వదలని కరోనా

వరుసగా మూడోసారి పాజిటివ్‌

బ్రసిలియా: బ్రెజిల్ అధ్య‌క్షుడు జైర్ బోల్సొనారో (65)కు వరుసగా మూడోసారి కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. జూలై 15 తరువాత ఫాలో-అప్ పరీక్షల అనంతరం తాజాగా ఆయనకు మరోసారి పాజిటివ్‌ వచ్చింది. అధికార నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉంటూ అక్క‌డి నుంచే అధికార కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తాన‌ని  బోల్సొనారో ప్ర‌క‌టించారు. తేలికపాటి లక్షణాలున్నబాధితుల క్లినికల్ రికవరీ సగటు సమయం సుమారు రెండు వారాలు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే రెండు వారాల తరువాత  కూడా ఆయనకు నెగిటివ్‌ రాకపోవడం గమనార‍్హం. (బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా

తాజాగా బోల్సొనారోకు మరోసారి పాజిటివ్‌ వచ్చిందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని బ్రెజిల్‌ ప్రభుత్వం ప్రకటించింది. వీడియోకాన్ఫరెన్సుల ద్వారా మాత్రమే కార్యలాపాలు కొనసాగిస్తారని తెలిపింది. అలాగే అధ్యక్షుడి ఈశాన్య బ్రెజిల్ పర్యటనను రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే కరోనా చిన్న జలుబు మాత్రమే అంటూ కొట్టిపారేయడంతో పాటు, మాస్క్‌ లేకుండానే సంచరించి వివాదం రేపిన జేర్ బొల్సొనారోకు ఈ నెల మొదట్లో (జూలై, 7) వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. దీంతో సెమీ ఐసోలేషన్‌లో అధ్యక్ష నివాసం నుండే కార్యకలాపాలను చక్కబెడుతున్నారు. తనకు తేలికపాటి లక్షణాలే ఉన్నాయని ఈ సందర్భంగా ప్రకటించారు. యాంటీ మ‌లేరియా ఔష‌ధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను వాడుతున్నానని, ఇది తనకు సహాయపడిందని నమ్ముతున్నానని పదే పదే చెబుతూ వచ్చారు. అయితే వివాదాస్పద హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం మానేయాలని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ గత వారం కోరింది.  

కాగా బ్రెజిల్ ప్రభుత్వ సమాచారం ప్రకారం దేశంలో 2 మిలియన్లకు పైగా కరోనావైరస్ కేసులు నమోదు కాగా 81వేల మందికి పైగా మరణించారు. కరోనా మహమ్మారికి భారీగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా తరువాత బ్రెజిల్‌ రెండవ స్థానంలో ఉంది. 

మరిన్ని వార్తలు