అక్కడ ఐదు నిమిషాల్లో పెళ్లి చేస్తారు

30 May, 2020 08:44 IST|Sakshi

బ్రెసీలియా: వివాహం అంటే జీవితాంతం గుర్తుపెట్టుకునే వేడుక. దాని కోసం ఎంత ఖర్చు అయినా చేస్తారు.. ఎక్కడికైనా వెళ్తారు. ఇప్పటి వరకు మనం డెస్టినేషన్‌ వెడ్డింగ్‌, గాల్లో, నీటిలో జరిగిన  వివాహ వేడుకలను చూశాం. కానీ బ్రెజిల్‌కు చెందిన జోవా బ్లాంక్‌, ఎరికా బ్లాంక్‌ మాత్రం వినూత్నంగా వివాహం చేసుకున్నారు. అదే ‘డ్రై థ్రూ’ వివాహా వేడుక. ఈ నయా ట్రెండ్ బ్రెజిల్‌లో ఇప్పుడిప్పుడే బాగా పాపులర్‌ అవుతుంది. ఈ వేడుక ఐదు నిమిషాల పాటు జరుగుతుంది. కార్లో వచ్చిన జంటలు తమ ప్రమాణాలను చదివి, ఉంగరాలను మార్పిడి చేసుకుంటారు. తర్వాత మాస్క్‌ మీదుగానే ముద్దు పెట్టుకుంటారు. దాంతో వారి వివాహం పూర్తయినట్లే. వెంటనే అధికారులు వారికి మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. తర్వాత ఆ కారు వెళ్లి పోతుంది. మరో కారు మరో జంటతో వస్తుంది.

ఈ సందర్భంగా ఎరికా మాట్లాడుతూ.. ‘పెళ్లి చేసుకోవాలని వారం క్రితం అనుకున్నాము. ఈ డ్రైవ్‌ థ్రూ వివాహ వేడుక గురించి తెలుసుకున్నాము. ఈ పద్దతి మాకు చాలా నచ్చింది. కొత్త పద్దతిలో వివాహం చేసుకోవడం చాలా బాగుంది. సంతోషంగా కూడా ఉంది అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి బ్రెజిల్‌ హాట్‌స్పాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ కట్టడి కోసం ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్‌ అమలవుతోంది. దాంతో ఆ దేశ యువత ఈ డ్రైవ్‌ థ్రూ వివాహ వేడుకవైపు ఆకర్షితులవుతున్నారు. కొన్ని చోట్ల వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా వివాహ వేడుకలు జరుగుతుండగా..మరికొన్ని చోట్ల ఇలా ‘డ్రైవ్‌ థ్రూ’ పద్దతిలో వివాహాలు జరుగుతున్నాయి.(అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్‌!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా