రోగులపై లైంగిక వేధింపులు: డాక్టర్ అరెస్టు

20 Aug, 2014 10:55 IST|Sakshi
రోగులపై లైంగిక వేధింపులు: డాక్టర్ అరెస్టు

కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన పలువురు రోగులను లైంగికంగా వేధించి, మూడేళ్లుగా పరారీలో ఉన్న ఓ ముసలి డాక్టర్ను బ్రెజిల్ పోలీసులు అరెస్టు చేశారు. రోజర్ అబ్దెల్మసీ (70) అనే ఈ డాక్టర్ బ్రెజిల్ వదిలిపెట్టి పొరుగునున్న పరాగ్వే దేశంలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అక్కడ అతడిని అరెస్టు చేసి బ్రెజిలియన్ అధికారులకు అప్పగించారు. వీసా కూడా లేకుండా పరాగ్వేలో ఉంటున్నందుకు అతడిని అరెస్టు చేశారు.

ఇన్నాళ్లుగా ఎవరికీ చిక్కకుండా పలు యూరోపియన్ దేశాలలో తిరుగుతూ మూడు నెలల క్రితమే ఆ డాక్టర్ పరాగ్వే చేరుకున్నాడు. బ్రెజిల్లోని అతిపెద్ద నగరమైన సాన్ పాలోలో కృత్రిమ గర్భధారణ నిపుణుడిగా పేరొందిన రోజర్ మీద దాదాపు 35 మంది మాజీ రోగులు ఫిర్యాదు చేశారు. అతడు తమను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఆయనపై 56 కౌంట్ల అత్యాచారం, లైంగిక వేధింపులు 2010లోనే రుజువయ్యాయి. దాంతో 278 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. దాంతో శాన్ పాలో మెడికల్ కౌన్సిల్ అతడి లైసెన్సును రద్దుచేసింది.

మరిన్ని వార్తలు