బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా 

7 Jul, 2020 21:10 IST|Sakshi

బ్రెసిలియా:  బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో , కరోనా  బారినపడ్డారు. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సొనారో మంగళవారం ధృవీకరించారు. ఆసుపత్రినుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన బ్రెసిలియాలోని ప్యాలెస్ లో తన మద్దతుదారులతో మాట్లాడారు.  ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. (మాస్క్‌ తప్పనిసరి.. అనవసర ఆదేశం)

మార్చిలో ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ప్రతినిధి బృందంలో చాలా మంది సభ్యులు వైరస్ బారిన  పడటంతో బోల్సొనారోకు  నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో మూడుసార్లు నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. బ్రెజిల్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తూ మరణమృదంగం మోగిస్తున్నా లాక్ డౌన్ ప్రకటించేందుకు ససేమిరా అన్న బోల్సోనారో  వివాదానికి తెరతీశారు.  కాగా కరోనా  ప్రభావానికి తీవ్రంగా గురైన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో అమెరికా నిలిచింది.  ఇప్పటివరకు 65,000 మందికి పైగా బ్రెజిలియన్లు మరణించగా 1,500,000 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు.

మరిన్ని వార్తలు