వాయు కాలుష్యంతో ఒబెసిటీ!

14 Mar, 2020 12:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తాజా అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్‌: కలుషితమైన గాలిని పీల్చడం ఒబెసిటీ (ఊబకాయం), డయాబెటిస్, జీర్ణాశయాంతర రుగ్మతలు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను పెంచుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ఎన్విరాన్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. అమెరికాలోని కొలరాడో బౌల్డర్‌ యూనివర్సిటీ నిపుణులు ఈ పరిశోధన నిర్వహించారు. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు సూర్మరశ్మికి గురైనప్పుడు ఓ ప్రమాదకరమైన వాయు కాలుష్య ఓజోన్‌ వీరు గుర్తించారు. ఈ గాలి, అందులో ఉండే కారకాలు ఊబకాయ వ్యాధికి కారణమవుతాయని వారు పేర్కొన్నారు. (చదవండి: వణికిపోతున్న అమెరికా..)

‘వాయు కాలుష్య కారకాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని గత అధ్యయనాలు వెల్లడించినట్లు మనకు తెలిసిందే’ అని కొలరాడో బౌల్డర్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తాన్యా అల్డిరీట్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 88 లక్షల మంది ఈ వాయు కాలుష్య బారిన పడి మృతి చెందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. శ్వాసకోశ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ కనబరిచినప్పటికీ.. వాయు కాలుష్యం రక్తంలో చక్కెరను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, అలాగే ఊబకాయం ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందని తేలింది. (మరణాలు 5 వేలు.. కేసులు 1.34 లక్షలు)

మరిన్ని వార్తలు