బ్రెగ్జిట్‌ బ్రిటన్‌కు గొప్ప అవకాశం: బోరిస్‌

28 Jul, 2019 04:50 IST|Sakshi

మాంచెస్టర్‌: బ్రెగ్జిట్‌ ద్వారా బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లవచ్చనీ, ఇది గొప్ప అవకాశమని ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. కానీ థెరిసా మే ప్రభుత్వం మాత్రం దీన్ని ప్రతికూలాంశంగానే చూసిందన్నారు. మాంచెస్టర్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో బోరిస్‌ మాట్లాడుతూ.. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసిన ప్రాంతాల్లో కొత్తగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ప్రస్తుతం ఆగిపోయిన బ్రెగ్జిట్‌ చర్చలను వేగవంతం చేస్తామనీ, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఫ్రీపోర్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.  బ్రిటన్‌లోని ఉత్తర ఐర్లాండ్, పొరుగునున్న రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలు ఉండాలన్న నిబంధనను తొలగిస్తే ఈయూతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని చెప్పారు. ఒప్పందం కుదిరినా, కుదరకున్నా అక్టోబర్‌ 31 నాటికి ఈయూ నుంచి బయటకొచ్చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు