నార్త్‌ కరోలినాలో పుట్టిన నియాన్‌ గ్రీన్‌ కుక్క!

17 Jan, 2020 14:47 IST|Sakshi

ఉత్తర కరోలీనాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ పెంపుడు కుక్క లెమన్‌ ఎల్లో రంగు కుక్కపిల్లకు జన్మినిచ్చింది. నార్త్‌ కరోలినాకు చెందిన షానా స్టామీ అనే మహిళా తెల్లటి జర్మన్‌ షెపర్డ్‌ కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు జిప్సీ. ఈ క్రమంలో జిప్సీ గత శుక్రవారం ఉదయం 8 కుక్క పిల్లలకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని ఆ మహిళ బుధవారం  ఫేస్‌బుక్‌లో షేర్‌చేశారు. ‘మా జర్మన్‌ వైట్‌ షెపర్డ్‌ బ్రైట్‌ గ్రీన్‌ కలర్‌ కుక్కపిల్లకు జన్మనిచ్చింది. పేరు హల్క్‌.. ప్రస్తుతం దీని వయసు 5 రోజుల’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ దీంతో హల్కి ఫొటోలను చూసి నెటిజన్లంతా అశ్యర్యపోతూ ‘ఇట్స్‌ టైమ్‌ టూ మిస్టర్‌ లైమ్‌’, ‘వావ్‌ ఎంత ముద్దుగా ఉంది హల్క్‌. ఐ లవ్‌ హల్క్‌ కలర్‌’  అంటూ కామెంట్లు పెడుతున్నారు

దీనిపై యాజమాని మాట్లాడుతూ.. జిప్సి శుక్రవారం ఎనిమిది కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగవది నియాన్‌ గ్రీన్‌ కలర్‌లో జన్మించడంతో నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. హల్క్‌ నియాన్‌ రంగులో ఉన్నప్పటికీ మిగతా కుక్కపిల్లలాగే ఇది సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది’ అని చెప్పారు. ఇక హల్క్‌ రంగుపై వైద్య నిపుణులు మాట్లాడుతూ.. తల్లి కుక్క గర్బంతో ఉన్నప్పుడు గామా కిరణాలు పడకపోవడం వల్ల ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతాయని తెలిపారు. గామా కిరణాలు తగలకపోతే గర్బధారణ సమయంలో కొన్ని ద్రవాలు విడుదల అవుతాయని, ఆ ద్రవాలు వివిధ రంగుల్లో ఉండటం వల్లే పుట్టే కుక్కిపల్లలు సాధారణ రంగులో కాకుండా భిన్నమైన రంగుల్లో జన్మిస్తాయన్నారు. అందువల్లే ‘హల్క్‌’ నియాన్‌ గ్రీన్‌లో జన్మించి ఉంటుందని నిపుణులు వివరణ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు