సొరంగ మార్గంలో చేతికందే మేఘాలు!

19 Aug, 2016 13:44 IST|Sakshi
సొరంగ మార్గంలో చేతికందే మేఘాలు!

లండన్: బ్రిటన్ ప్రభుత్వం ఓ బృహత్తర కార్యక్రమాన్ని తలపెడుతోంది. ఆ దేశంలోని అతి పొడవైన సొరంగ మార్గంలో అబ్బురపడే మార్పులు చేయనుంది. 18 మైళ్ల పొడవున ఉన్న ఈ సొరంగంలో ఏర్పాటుచేసిన రహదారి పక్కనే పామ్ చెట్లు, మంచి గ్రీనరీ పెంచడంతోపాటు సొరంగం పై భాగంలో కృత్రిమ మేఘాలు సృష్టించనుంది. మాంచెస్టర్ నుంచి షెఫీల్డ్ మధ్య ఉన్న ఈ భారీ సొరంగంలో నుంచి వెళుతున్నవారు తీవ్ర మానసిక ఒత్తిడిలకు లోనవడమే కాకుండా లాస్ట్రోపోబియా, డిసోరియేంటేషన్(భ్రాంతి చెందే స్థితి), నీరసానికి గురవడంవంటి రోగాలకు గురవుతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది.

దీంతో వారిని ఆ భారి నుంచి బయటపడేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో నార్వే, చైనా దేశాల్లో ఈ తరహాలో నిర్మించిన రెండు సొరంగాలను బ్రిటన్ స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమానికి తెరతీస్తోంది. సొరంగ మార్గాల్లో ఈ తరహా మార్పులు చేసే విధానం 50 ఏళ్ల కిందటే రాగా ఇప్పుడిప్పుడే ఒక్కో దేశం వాటిని తమకు అనునయించుకుంటోంది. సొరంగ మార్గాల్లో తక్కువగా ఉండే వెళుతురు, గాలి, టన్నెల్ వాతావరణం అందులో డ్రైవింగ్ చేస్తున్నవారికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని, అది ఎంతమొత్తంలో అనేది ఊహించడం కష్టం కాదని వారు చెబుతున్నారు. అందుకే సమూలంగా ఇక మార్పులు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


మరిన్ని వార్తలు