‘బ్రెగ్జిట్‌ జరగకుంటే సంక్షోభమే’

9 Mar, 2019 03:17 IST|Sakshi
బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే

గ్రిమ్‌స్బై: బ్రెగ్జిట్‌ విషయంలో యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) దేశాలు మరో అడుగు ముందుకేయాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే విజ్ఞప్తి చేశారు. లేదంటే బ్రెగ్జిట్‌ ఎన్నటికీ జరగదనీ, సంక్షోభం నెలకొంటుందని హెచ్చరించారు. ఈయూ నుంచి బ్రిటన్‌ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్‌ బిల్లును బ్రిటిష్‌ పార్లమెంటు  తిరస్కరించింది. ‘వచ్చే మంగళవారం జరిగే ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌ బిల్లు తిరస్కరణకు గురైతే మిగిలేది సంక్షోభమే.  అంతిమంగా బ్రిటన్‌ ఈయూ నుంచి ఎన్నటికీ విడిపోదు’ అని మే అన్నారు. 2016లో జరిగిన బ్రెగ్టిట్‌ లో ఈయూ నుంచి బ్రిటన్‌ విడిపోవాలని 51.9 శాతం మంది బ్రిటిషర్లు ఓటేశారు.

మరిన్ని వార్తలు