ప్రధాని పెద్ద మనసు.. బిడ్డకు వైద్యుడి పేరు

3 May, 2020 11:25 IST|Sakshi

లండన్‌ : కరోనా బారిన పడి ఇటీవల పూర్తిగా కోలుకున్న బ్రిటన్‌ ప్రధానమంత్రి తన చికిత్స అనుభవానుల మీడియాతో పంచుకున్నారు. కోవిడ్‌ బారినపడిన తనకు వైద్యులు అద్బుతమైన సేవలను అందించారని వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఐసీయూలో ఉంచి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించారని, వారి సేవలతోనే తాను పూర్తిగా కోలుకున్న అని జాన్సన్‌ తెలిపారు. కాగా  మార్చి 26న బ్రిటన్‌ ప్రధానికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందారు. అనంతరం వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని ప్రస్తుతం రోజూవారి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. కాగా తనకు వైద్య సేవలు చేసి డాక్టర్లకు జాన్సన్‌ తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపారు. (బ్రిటన్‌లో లక్ష వరకు‍ కరోనా మృతులు) 

ఆయన జీవన సహచరి క్యారీ సైమండ్స్‌(32) బుధవారం లండన్‌ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తన బిడ్డకు వైద్యుడి పేరు వచ్చేలా పేరు పెట్టి తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఆ పిల్లోడికి విల్‌ఫ్రెడ్ లారీ నికోల‌స్ జాన్స‌న్ అని పేరు పెట్టారు. ఆ పేరులో ఇద్ద‌రు తాత‌య్య‌ల పేర్లు, బోరిస్‌కు చికిత్స అందించిన‌ మ‌రో ఇద్ద‌రు డాక్ట‌ర్ల పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందిచిన వైద్యులు తమకు ఇంతకన్నా పెద్ద గౌరవం ఏముందటుందని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు బ్రిటన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,78, 000కి చేరింది. 28 వేల మంది మృత్యువాత పడ్డారు. (మగబిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని సహచరి)

మరిన్ని వార్తలు