కరోనా కాటు : 36 వేల మంది ఉద్యోగులు సస్పెన్షన్‌ 

2 Apr, 2020 15:49 IST|Sakshi

కరోనా వైరస్ సంక్షోభం ఫలితంగా  బిజినెస్ ట్రావెలర్ బ్రిటీష్ ఎయిర్‌వేస్ (బీఏ)భారీ సంఖ్యలో ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించనున్నది. సుమారు 36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని  భావిస్తోంది.  ఈ అంశంపై త్వరలోనే కంపెనీ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో యునైట్ యూనియన్‌తో బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఒక ఒప్పందం కుదర్చుకోనుంది. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్‌, ఇంజినీర్లు, హెడ్ ఆఫీసులో పనిచేసే దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల వరకు విధుల నుంచి తొలగించనుది. అంతేకాదు రానున్న రెండు నెలల్లో సగం జీతానికే (50 శాతం వేతన కోత) పైలట్లు విధులను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి విమానయాన సంస్థ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. 

మరోవైపు మరో ప్రత్యర్థి సంస్థ  వర్జిన అట్లాంటిక్  రాబోయే రోజుల్లో వందల మిలియన్ల పౌండ్ల విలువై ఉద్దీపన కోసం యూకే ప్రభుత్వాన్ని ఆశ్రయించనుందని  భావిస్తున్నారు. అయితే యూకే ఆర్థికమంత్రి రిషి సునక్ ఇటీవలమాట్లాడుతూ, విమానయానసంస్థలకు "చివరి ప్రయత్నంగా"సహాయం చేయడానికి మాత్రమే ప్రభుత్వం అడుగులు వేస్తుందని, వాటాదారుల నుండి డబ్బును సేకరించడానికి ప్రయత్నించమని విమానయాన సంస్థలను కోరారు. ఈ విషయంలో "కేసుల వారీగా" నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.  కాగా  కరోనా కల్లోలం కారణంగా  ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలన్నీదాదాపు దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేశాయి. బీఏ కంపెనీ కూడా దాదాపు అన్ని విమానాలు సేవలు  నిలిపి వేసింది. ప్రపంచ ప్రయాణ ఆంక్షలు, క్షీణిస్తున్న డిమాండ్  విమానయాన సంస్థలు కుదేలవుతున్న సంగతి విదితమే.  (కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్)

చదవండి : కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్ 
కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం
చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం

మరిన్ని వార్తలు