అంతరిక్షం నుంచి రాంగ్ కాల్...!

26 Dec, 2015 00:05 IST|Sakshi
అంతరిక్షం నుంచి రాంగ్ కాల్...!

మొబైల్ ఫోన్ల వాడకం వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా రాంగ్ కాల్స్ రావడం మామూలై పోయింది. ఒకరికి చేరాల్సిన కాల్ మరొకరికి చేరడమూ... ఒక కాల్ మాట్లాడుతుండగా మధ్యలో ఇంకొకరి మాటలు వినిపించడమూ సర్వ సాధారణమైపోయింది. అయితే ఇతర నగరాలు, రాష్ట్రాలు, దేశాలే కాదు... ఇటీవల స్పేస్ సెంటర్ కు వెళ్ళిన ఆస్టోనాట్ కూ అదే అనుభవం ఎదురైందట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం...

ఇటీవల అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి పలువురు సభ్యుల బృదం తరలి వెళ్ళిన విషయం తెలిసిందే. వీరందరినీ కజకిస్థాన్ లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సోయజ్ కాప్సూల్ ద్వారా  ఇంటర్నేషనల్ స్సేస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం ఆరు నెలల పాటు ఉండే అంతరిక్ష యాత్రకు ఈ వ్యోమగాములు వెళ్ళారు.  అయితే ఈ బృదంలోని బ్రిటన్ కు చెందిన ఆస్టోనాట్  టిమ్ పీక్ కు ఇదే తొలి స్పేస్ జర్నీ. అంతేకాదు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి బ్రిటన్ దేశస్థుడు కూడ ఆయనే. ఆరునెలల పాటు అంతరిక్షంలో విధులు నిర్వహించనున్న టిమ్ పీక్ భూమిపై ఉన్న అధికారులు, కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే  తాజాగా ఆయనకు ఓ వింత అనుభవం ఎదురైందట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఆయన ఫోన్ చేస్తే... అది... నంబర్ తప్పు డయల్ కావడంతో రాంగ్ కాల్ వెళ్ళిందట.

''ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్'' అంటూ అడిగిన కిమ్ కు ఆశ్చర్యం కలిగిందట. అట్నుంచి ఓ మహిళ స్వరం వినిపించడంతో '' హలో, ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్''  అని మరోసారి అడిగారట.  తీరా తర్వాత అసలు విషయం అర్థమైందట.  పొరపాటున రాంగ్ నంబర్ చేశానని కిమ్ గ్రహించారు. ఓ తప్పు సంఖ్య డయల్ చేయడం రాంగ్ కాల్ కు కారణమైందని,  ఆ మహిళకు క్షమాపణలు చెప్తూ కిమ్ పీక్  ట్వీట్ చేశారు. 43 ఏళ్ళ హెలికాఫ్టర్‌ పైలట్‌ అయిన కిమ్ పీక్ ఈ యాత్ర కోసం సుమారు 28నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. యాత్రలో భాగంగా 173 రోజులు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు