బ్రిటన్‌ ఆరోగ్య మంత్రికి కరోనా

11 Mar, 2020 08:06 IST|Sakshi

లండన్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ యూరప్‌లో విస్తృతంగా వ్యాపిస్తోంది. తనకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి, ఎంపీ నదిన్‌ డారీస్‌ స్వయంగా వెల్లడించారు. మంత్రి ప్రకటనతో సీనియర్‌ అధికారులూ పెద్దసంఖ్యలో కరోనా బారిన పడి ఉంటారని భావిస్తున్నారు. తనకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని, ఇంటిలో ఒంటరిగా ఉన్నానని కన్జర్వేటివ్‌ ఎంపీ డారీస్‌ పేర్కొన్నారు. ఆమెకు కరోనా ఎలా సోకింది..ఆమె ఎవరితో సన్నిహితంగా మెలిగారని వైద్యారోగ్య అధికారులు ఆరా తీస్తున్నారు.

డెడ్లీ వైరస్‌తో ఇప్పటికే బ్రిటన్‌లో ఆరుగురు మరణించగా, 370 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. కొవిడ్‌-19 బారిన పడిన తొలి బ్రిటన్‌ రాజకీయ నేత డారిస్‌ కావడం గమనార్హం. మరోవైపు ఆమె బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సహా వందలాది మందితో సంప్రదింపులు జరిపిన క్రమంలో వారికీ స్ర్కీనింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. కరోనా వైరస్‌కు బీమా కవరేజ్‌ వర్తించే పత్రాలపై సంతకాలు చేస్తున్న క్రమంలోనే వైరస్‌ బారిన పడిన డారిస్‌ ప్రస్తుతం కోలుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.

చదవండి : 'కరోనా' కదన రంగంలోకి వలంటీర్లు

>
మరిన్ని వార్తలు