గూగులమ్మను తెగ వెతికేశారు

25 Jun, 2016 11:49 IST|Sakshi
గూగులమ్మను తెగ వెతికేశారు

అసలు బ్రెగ్జిట్ అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే ఏం జరుగుతుంది, ఈయూ ఎప్పుడు రూపొందింది.. ఇలాంటి విషయాలేవీ రిఫరెండంలో ఓటు వేసే ముందు చాలామంది బ్రిటిషర్లకు తెలియదు. ఎందుకంటే, ఓటింగ్ పూర్తయ్యి.. ఫలితాలు కూడా వెలువడిన తర్వాత చాలామంది ఈ తరహా ప్రశ్నలతో గూగుల్ సెర్చిని మోతెక్కించారట. కేవలం రిఫరెండం ఫలితాల గురించే కాక.. బ్రెగ్జిట్ గురించిన ప్రాథమిక సమాచారం కోసం చాలామంది గాలించినట్లు గూగుల్ తెలిపింది.

‘‘మనం యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతే ఏమవుతుంది’’ అనే ప్రశ్న చాలా ఎక్కువగా వచ్చిందని ప్రకటించిది. ఇంకా చాలామందికి అసలు యూరోపియన్ యూనియన్ అంటే ఏంటి, అది ఎప్పుడు ప్రారంభమైంది, అందులో ఎన్ని దేశాలున్నాయి.. ఇలాంటి విషయాలు కూడా తెలియవని, ఇలాంటి అనేక ప్రశ్నలను గూగుల్ సెర్చ్లో ఎక్కువగా వేశారని తెలిపింది. డేవిడ్ కామెరాన్ వయసెంత, ఆయన రాజీనామా చేశారా, ఆ తర్వాత ప్రధాని ఎవరవుతారు.. ఇలాంటి ప్రశ్నలు సైతం వచ్చాయి. అలాగే అసలు మనం యూరోపియన్లమేనా అనే ప్రశ్నను కూడా చాలా ఎక్కువ మంది అడిగారంటూ గూగుల్ వివరించింది.

వాళ్లు వేసిన మరికొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి...

  • నేను ఈయూ రిఫరెండంలో ఎలా ఓటు వేయాలి
  • బ్రెగ్జిట్ అంటే ఏంటి
  • ఈయూ రిఫరెండంలో ఎవరెవరు ఓట్లు వేయచ్చు
  • ఈయూ రిఫరెండం ఎప్పుడు నిర్వహిస్తారు
  • నేను ఎక్కడ ఓటు వేయచ్చు
  • మనం ఈయూలో ఎందుకు ఉండాలి
  • మనం ఈయూను ఎందుకు వదిలేయాలి
  • మనం వదిలేస్తే ఏం జరుగుతుంది
  • ఈయూ డిబేట్లో ఎవరు నెగ్గారు
  • ఈయూలో ఏవేం దేశాలు ఉన్నాయి
  • డేవిడ్ కామెరాన్ తర్వాత ఎవరు వస్తారు
  • డేవిడ్ కామెరాన్ రాజీనామా చేశారా
  • అసలు కామెరాన్ ఎందుకు రిఫరెండం పిలిచారు
  • డేవిడ్ కామెరాన్ వయసెంత

మరిన్ని వార్తలు