ఫొటో 1 తరాలు 4

5 Jan, 2020 06:03 IST|Sakshi

లండన్‌: కొత్త దశాబ్దం ప్రారంభం సందర్భంగా బ్రిటన్‌ రాణి రెండో ఎలిజబెత్‌ శనివారం తన వారసులతో కలసి దిగిన ఫొటోను విడుదల చేశారు. అందులో రాణి సహా నాలుగు తరాల రాజరికం ఉంది. గతంలో 2016లో ఆమె 90వ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు వారసులతో కలసి ఫొటో దిగగా, ఇప్పుడు విడుదల చేసింది రెండో ఫొటో కావడం గమనార్హం. ఇప్పటి ఫొటోలో కూడా రాణి కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్, మనవడు ప్రిన్స్‌ విలియం, ముని మనవడు ప్రిన్స్‌ జార్జ్‌లు ఉన్నారు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో క్రిస్మస్‌ పండుగకు వారంముందు ఈ ఫొటోను  తీశారు. ఇందులో రాణి తెలుపు గౌన్‌ ధరించారు. ఆమెకు ఇరు వైపులా రాజకుమారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు