బ్రూటల్ రివేంజ్

1 Apr, 2016 17:05 IST|Sakshi

శత్రువులు రౌండప్ చేశారు.. ఇటు గుండె వేగం పెరిగింది. వాళ్ల కాళ్లు కదులుతున్నాయి.. ఇవతల మైండ్ హీట్ పీక్స్ కు చేరింది. వాడు దూకేశాడు.. అంతసేపు తనతో కలిసి గడ్డిమేసినవాణ్ని దారుణంగా గాయపరిచాడు. అంతే తెగింపు తన్నుకొచ్చేసింది. అవతలిది అడవికి రాజు కావచ్చు, కానీ ప్రాణంకోసం పాకులాటలో అవేవీ పట్టింపుకాదు. గెలిచామాలేదా అన్నది పాయింటే కాదు. బతికామా లేదా అన్నదే ముఖ్యం. దున్నపోతు కాలు దువ్వింది, బ్రూటల్ రివేంజ్ కు సిద్ధమైంది. కట్టడిచేసిన సింహం మూకపైకి ఒక్కసారిగా లంఘించింది. తనతోపాటు దున్నపోతుల బృందాన్ని కాపాడుకునేందుకు సింహాలతో శక్తికిమించి పోరాడింది. కొమ్ములతో వాటిని చీల్చిచెండాడింది. ఎత్తికుదేసింది.

కానీ టైమ్.. ఆ టైమ్ సింహాలది. ఒక్క దున్నపోతు పోరాడుతుంటే సహాయానికి రాకుండా విడివిడిగా నిల్చున్న మిగతా దున్నపోతులపై సింహాలు కలిసికట్టుగా దాడిచేశాయి. తోటి జీవులు చనిపోవటాన్నిచూసి.. పోరాడుతోన్న దున్నపోతు సత్తువ నీరుగారిపోయింది. చివరికి సింహాలదే పైచేయి అయింది. దున్నపోతుల గుంపులో సగానికి సగాన్ని హతమార్చాయి. మిగతా సగం పారిపోయాయి. దక్షిణాఫ్రికాలోని ప్రఖ్యాత రిజర్వు ఫారెస్ట్ మలామలాలో చోటుచేసుకున్న ఈ దృశ్యాలను బ్రెజిల్ కు చెందిన మహిళా ఫొటోగ్రాఫర్ మారియాంజెలా లీ ఎంతోసాహసోపేతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో అందరినీ ఆకర్షిస్తున్నాయి.



 

>
మరిన్ని వార్తలు