పాక్ నుంచి చైనా వ్యాపారం షురూ

14 Nov, 2016 01:07 IST|Sakshi

గ్వాదర్ పోర్టు నుంచి సరుకుల ఎగుమతి ప్రారంభం
 
 ఇస్లామాబాద్: చైనా, పాకిస్తాన్  ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా పాక్‌లో పునరుద్ధరించిన గ్వాదర్ పోర్టు నుంచి ఆదివారం చైనా సరుకుల ఎగుమతి ప్రారంభమైంది. 250 కంటైనర్లతో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు సరుకులు చేరవేయడానికి చైనాకు వాణిజ్య నౌక గ్వాదర్ నుంచి బయలుదేరింది. బలూచిస్తాన్‌లోని ఈ పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రారంభించారు.

దీంతో పశ్చిమ చైనాను అరేబియా సముద్రంతో కలపాలన్న చైనా కల నెరవేరింది. చైనా ప్రారంభించిన వన్ బెల్ట్- వన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా ఈ పోర్టును ప్రారంభించి తమ నిబద్ధతను చాటుకున్నామని, సీపీఈసీలో గ్వాదర్ పోర్టు కీలకమైనదని నవాజ్ పేర్కొన్నారు. సీపీఈసీలో భాగం గా చేయాల్సిన పనుల్ని గడువులోగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు