అంతరిక్షంలో క్యాబేజీ

19 Feb, 2017 02:26 IST|Sakshi
అంతరిక్షంలో క్యాబేజీ

వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) లో పండించిన తొలి క్యాబేజీ పంట కోతకొచ్చింది. నాటిన నెల రోజుల తరువాత పచ్చని ఆకులతో చైనీస్‌ క్యాబేజీ కోతకు సిద్ధమైనట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది.

వ్యోమగామి పెగ్గీ విట్సన్  కోస్తున్న ఈ చైనీస్‌ క్యాబేజీ పంటలో కొంత భాగాన్ని ఐఎస్‌ఎస్‌ సిబ్బంది తినడానికి ఉపయోగించగా మిగిలిన దాన్ని నాసాకు చెందిన కెన్నడీ స్పేస్‌ సెంటర్‌కు పరిశోధనల నిమిత్తం తీసుకొస్తారు. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాగైన ఐదో పంట. వివిధ ఆకు కూరలను అనేకరకాలుగా పరీక్షించిన మీదట అంతరిక్షంలో పెరిగినప్పుడు వీటి పోషక విలువల్లో తేడాను గుర్తించడానికి ఐఎస్‌ఎస్‌లో దీన్ని సాగుచేయడానికి ఎంపిక చేశారు.

మరిన్ని వార్తలు