గోడ వెనుక ఏముంది?

29 Jan, 2018 18:08 IST|Sakshi
కెమెరా

అడ్డు‘గోడల్ని’ ఛేదించే స్మార్ట్‌ కెమెరాలు

లండన్‌: కేవలం మీ ఫోన్‌కున్న కెమెరాతో ఓ గోడకు ఇవతలి వైపు ఉండి అవతల ఎవరున్నారో తెలుసుకోగలిగితే? మీ శరీరాన్ని, మెదడును కేవలం ఓ కెమెరాతో స్కాన్‌ చేయగలిగితే? పొగమంచులోనూ రోడ్లను స్పష్టంగా చూడగలిగితే? వాటి ఫొటోలు కూడా స్పష్టంగా తీయగలిగితే? ప్రస్తుతానికి ఇవన్నీ అసాధ్యంగానే అనిపిస్తున్నప్పటికీ భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న అత్యాధునిక కెమెరాలతో సాధ్యమేనని పరిశోధకులు చెబుతున్నారు. వీటి సాయంతో సరికొత్త నిఘా ఫోన్ల శకం మొదలవుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గోకు చెందిన ప్రొ.డానియేల్‌ ఫాసియో, హెరియట్‌–వాట్‌ వర్సిటీకి చెందిన ప్రొ.స్టీఫెన్‌ మెక్లాగ్లీన్‌ ఓ వ్యాసం రాశారు. భవిష్యత్‌ కెమెరాల్లో షార్ట్‌ లేజర్‌ కిరణాలను ఓ గదిలో ప్రయోగించినప్పుడు గోళాకృతిలో అన్ని కోణాల్లోనూ విస్తరిస్తాయని తెలిపారు. గోడల్ని దాటివెళ్లి వస్తువుల్ని తాకే ఈ కిరణాలు వెనక్కి తిరిగివస్తాయని వెల్లడించారు.

ప్రత్యేకంగా రూపొందించిన అత్యంత సున్నితమైన కెమెరాలు వెనక్కు వచ్చే లేజర్‌ కిరణాలను గుర్తిస్తాయన్నారు. ఈ కెమెరాలు ఓ సెకనులో 20 బిలియన్‌ ఫ్రేముల్ని రికార్డు చేయగలవన్నారు. తాము ల్యాబ్‌ లో చేసిన పరీక్షలో ఓ గోడ అవతలి వైపున ఉండే వస్తువుల్ని ఈ కెమెరాల ద్వారా గుర్తించడం సాధ్యమేనని తేలిందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనాస్థలికి చేరుకోకుండానే లేదా అక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో బాధితుల్ని రక్షించడానికి ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

కుక్క మాంసం తినొద్దు ప్లీజ్‌!

డర్టీ కారు పార్క్‌ చేస్తే రూ. 9 వేలు ఫైన్‌!

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!

పెళ్లికి ఇదేమీ ‘ఆహ్వానం’ బాబోయ్‌!

విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు

టర్కీ చేరిన రష్యా ఎస్‌–400 క్షిపణులు

దారిద్య్రం నుంచి విముక్తి చెందారు

యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం

ఎట్టకేలకు టర్కీకి చేరిన ఎస్‌-400

మన పడక గదులకు అవే ‘చెవులు’

విమానంలో సీలింగ్‌ను గుద్దుకున్న ప్రయాణీకులు

ప్లాస్టిక్‌ ఇల్లు

అందులో మోదీ మాస్టర్‌ : యూఎస్‌ స్పీకర్‌

ఉందిలే మంచి కాలం

గూగుల్‌, అమెజాన్‌లకు ఫ్రాన్స్‌ షాక్‌

ఈసారి ఇరాన్‌ వంతు..బ్రిటన్‌ నౌక అడ్డగింత

డేంజర్‌; అక్కడికెళ్తే అంతే సంగతులు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం