మీ పిల్లలకు ఈ స్నాక్స్ ఇస్తున్నారా!

23 May, 2015 13:46 IST|Sakshi
మీ పిల్లలకు ఈ స్నాక్స్ ఇస్తున్నారా!

న్యూయార్క్: సాయంత్రమైతే చాలు పిల్లలు ఇంట్లో ఏదో ఒక స్నాక్ తినాల్సిందే. దీని వల్ల వారు అధికంగా బరువు పెరిగిపోయే ప్రమాదముంది. ఇది ఒబెసిటీకి దారి తీయచ్చు కూడా. పిల్లలు ఇలా సాయంత్రం ఆకలేసి అధికంగా తినకుండా ఉండాలన్నా, ఊబకాయం బారిన పడకుండా ఉండాలన్నా మధ్యాహ్నం పూట ప్రోటీన్ స్నాక్స్ అందించండి చాలు. ముఖ్యంగా సోయా ఫుడ్స్‌ని మధ్యాహ్నం తర్వాత స్నాక్స్‌గా అందిస్తే సాయంత్రం పూట తినే అవసరం ఉండదని, దీని ద్వారా పిల్లల్లో ఊబకాయం రాకుండా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. సోయా ప్రోటీన్ ఆహారాన్ని స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల పిల్లలకు కడుపు నిండా తిన్న భావన కలుగుతుందని, దాని ద్వారా వారు సాయంత్రం ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా పిల్లలు పెద్దవారిలాగా మధ్యాహ్నం పూర్తిస్థాయి భోజనాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు.
 
 ఈ సమయంలో సులువుగా లభించే స్నాక్స్ ఎక్కువగా తింటుంటారు. ఫలితంగా శరీరంలో అధిక స్థాయి కొవ్వులు, చక్కెరలు చేరుతాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. ఇలా పిల్లలు బరువు పెరగకుండా, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా ఉండాలంటే మధ్యాహ్నం ప్రోటీన్ స్నాక్స్‌ను అందించాలని పరిశోధకులు సూచించారు. మధ్యాహ్నం పూట తీసుకునే స్నాక్స్ టీనేజ్‌లోని బాలబాలికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై పరిశోధకులు అధ్యయనం చేశారు. మధ్యాహ్నం ప్రోటీన్ స్నాక్స్ తీసుకున్న వారు తర్వాత తక్కువ కొవ్వు పదార్థాల్ని తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదని, ఇలాంటి పిల్లల మానసిక స్థితి కూడా బావుందని అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ పరిశోధకులు వెల్లడించిన ఈ నివేదిక వివరాలు జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమయ్యాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

మెక్సికన్‌ గల్ఫ్‌లో అరుదైన షార్క్‌ చేప..

సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!

పాక్‌ ప్రధానిని అవమానించిన అమెరికా

‘థ్యాంక్‌ గాడ్‌.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’

ఆ సరస్సులో దిగారా.. ఇక అంతే!

పాక్‌ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

మొసలికి చిప్‌..

నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు

అమెరికాలో పూజారిపై దాడి

అమెరికా డ్రీమ్స్‌ కరిగిపోతాయా?

చైనా బలహీనతకు ట్రేడ్‌వార్‌ కారణమా?

అమెరికాలో స్వామీజీపై దాడి

జలుబు మంచిదే.. ఎందుకంటే!

వేడితో కరెంటు

ఆధిపత్యపోరులో భారతీయులు బందీలు

నాడూ రికార్డే.. నేడూ రికార్డే

ముసలి మొహం ప్రైవసీ మాయం!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

రూ.72 లక్షల జరిమానా.. జీవితకాల నిషేధం

ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా

పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4