ఇప్పుడు ట్రంప్‌‘క్షమా’ గోల!

22 Jul, 2017 01:13 IST|Sakshi
ఇప్పుడు ట్రంప్‌‘క్షమా’ గోల!

కిందటి నవంబర్‌ఎన్నికల్లో రష్యా జోక్యంపై స్పెషల్‌కౌన్సల్‌రాబర్ట్‌మలర్‌తన దర్యాప్తును డొనాల్డ్‌ట్రంప్‌ఆర్థిక లావాదేవీల వరకూ విస్తరించడం అమెరికా అధ్యక్షుడిని కొత్త ఆలోచనకు పురికొల్పింది. రష్యన్ల పాత్రపై పూర్వపు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌జేమ్స్‌కోమీ దర్యాప్తు నచ్చని ట్రంప్‌ఆయనను తొలగించారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు మలర్‌ను డెప్యూటీ అటార్నీ జనరల్‌రాడ్‌రాసెన్‌స్టెయిన్‌లిఖిత పూర్వక ఉత్తర్వు ద్వారా నియమించారు.

దర్యాప్తు కాలంలో తెలిసిన అంశాలపై కూడా కూపీ లాగవచ్చని ఈ ఉత్తర్వులో పేర్కొనడంతో మలర్‌తన పరిధిని విస్తరించారు. ట్రంప్‌సహాయకులు, అల్లుడు జారెడ్‌కష్నర్, పెద్ద కొడుకు జూనియర్‌ట్రంప్‌సహా ఆయన కుటుంబసభ్యుల వ్యవహారాల నుంచి ట్రంప్‌2008 నాటి ఆర్థిక లావాదేవీల వరకూ పలు అంశాలపై మలర్‌దర్యాప్తు చేస్తున్నారని తెలియడంతో ట్రంప్‌కొత్త వ్యూహానికి తెరతీశారు. ప్రజలను ప్రభుత్వం నుంచి కాపాడడానికి (చేసిన తప్పులు మన్నించడానికి) అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికి ఇచ్చిన క్షమాభిక్ష అధికారాన్ని ఈ వ్యవహారంలో వాడుకోవడానికి ఎంత వరకు వీలుందో పరిశీలించాలని ట్రంప్‌తన సలహాదారులను కోరారు.

తనను తాను అధ్యక్షుడు క్షమించుకోవచ్చా?
రష్యా జోక్యం వ్యవహారంలో పాత్ర ఉన్న కుటుంబసభ్యులు సహా తనవారందరితోపాటు ట్రంప్‌తనను తాను క్షమించుకోవడానికి కూడా ఆస్కారముందేమో చూడాలని సలహాదారులను అడిగారని తెలుస్తోంది. అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఏ అధ్యక్షుడూ తనకు తాను క్షమాభిక్ష ప్రకటించుకున్న సందర్భాలు లేవు. ఈ క్షమాభిక్ష అధికారం కింద ఇంకా అభియోగాలు నమోదుకాని, శిక్షపడనివారిని కూడా అధ్యక్షుడు క్షమించడానికి రాజ్యాంగం వీలు కల్పిస్తోంది. అందుకే ఈ విషయంపై ట్రంప్‌లాయర్లు విస్తృతంగా తమలో తాము చర్చించుకుంటున్నారని చెబుతున్నారు. తమకు మరీ ఇబ్బంది కలించేలా మలర్‌దర్యాప్తు సాగుతుంటే, ఆయనను ఏఏ కారణాలపై ఆ పదవి నుంచి తప్పించడానికి ఎన్ని అవకాశాలున్నాయనే విషయాన్ని కూడా ట్రంప్‌లాయర్లు పరిశీలిస్తున్నారు.

తొలగించడం సాధ్యంకాకపోతే మలర్‌దర్యాప్తు పరిధిని ఎలా కుదించాలి? అనే అంశంపై కూడా వారు తర్జనభర్జనలు పడుతున్నారు.ఽ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉండగా ఉత్తర వర్జీనియాలోని ట్రంప్‌నేషనల్‌గోల్ఫ్‌క్లబ్‌నుంచి మలర్‌వైదొలిగినపుడు సభ్యత్వ రుసుం వివాదం ఆయనకూ, క్లబ్‌కూ మధ్య వచ్చిందని, దీన్ని కారణంగా చూపించి మలర్‌ను ఈ దర్యాప్తు బాధ్యత నుంచి తొలగించవచ్చిని కొందరు ట్రంప్‌కు సలహా ఇచ్చారు. అయితే, మలర్‌క్లబ్‌సభ్యత్వం రద్దుచేసుకున్నప్పుడు మెంబర్‌షిప్‌ఫీ వివాదమేదీ లేదని ఆయన ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఎందుకొచ్చిందీ ఆలోచన?
ఫ్లారిడా పామ్‌బీచ్‌లోని ట్రంప్‌భవనాన్ని 2008లో రష్యా కుబేరుడొకరు కొనుగోలు చేయడం సహా అధ్యక్షుడి పాత లావాదేవీలను కూడా మలర్‌క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారనే వార్త తెలియడంతో ట్రంప్‌కు క్షమాభిక్ష ఆలోచన వచ్చిందంటున్నారు. అలాగే, ట్రంప్‌సమర్పించిన అనేక సంవత్సరాల ట్యాక్స్‌రిటర్న్స్‌పత్రాలను మలర్‌అధికారికంగా తెప్పించుకుని పరిశీలించే అవకాశముందనే సమాచారం కూడా ట్రంప్‌ను కంగారుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ‘స్వయం క్షమాభిక్ష’కు అవకాశాలపై అధ్యయనం చేయిస్తున్నారు. అధ్యక్షుడు తనను తాను క్షమించుకోవచ్చా? అనే అంటే ‘లేదు’ అని న్యాయకోవిదులెవరూ చెప్పలేదు. కాని, ఇంత వరకు ఏ అధ్యక్షుడూ ఈ పనిచేయలేదు. ఒకవేళ ఏ అధ్యక్షుడైనా స్వయం క్షమాభిక్ష ప్రకటించుకుని ఉంటే ఆ నిర్ణయంపై కోర్టు తీర్పు వచ్చి ఉండేది.

ఈ పరిస్థితి గతంలో తలెత్తకపోవడంతో ట్రంప్‌కు ఆ అధికారముందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వాటర్‌గేట్‌కుంభకోణంలో ఇరుక్కుని చివరికి రాజీనామా చేసే ముందు మాజీ అధ్యక్షుడు రిచర్డ్‌నిక్సన్‌ఈ స్వయం క్షమాభిక్ష గురించి ఆలోచించారు. ఈ అధికారం అధ్యక్షుడికి ఉందని ఆయన లాయర్‌చెప్పినా, దాన్ని వాడుకోకూడదనే నిక్సన్‌నిర్ణయించుకున్నారు. 1974 ఆగస్ట్‌లో పదవి రాజీనామా చేశాక నిక్సన్‌కు తర్వాత అధ్యక్ష పదవికి చేపట్టిన (ఉపాధ్యక్షుడు) జెరాల్డ్‌ఫోర్డ్‌క్షమాభిక్ష ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తప్పుపట్టిన ప్రజలు 1976 నవంబర్‌అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌పారీ‍్ట అభ్యర్థి జిమీ కార్టర్‌పై పోటీచేసిన ఫోర్డ్‌ను ఓడించారు. (సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌)

మరిన్ని వార్తలు