సిరియా, ఇరాక్ల నుండి ఫైటర్ జెట్ విమానాల ఉపసంహరణ

21 Oct, 2015 09:19 IST|Sakshi
సిరియా, ఇరాక్ల నుండి ఫైటర్ జెట్ విమానాల ఉపసంహరణ

కెనడా: సిరియా, ఇరాక్ల నుండి ఫైటర్ జెట్ విమానాలను ఉపసంహరించుకుంటున్నట్లు కెనడా ప్రధాని ట్రుడేవ్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తెలిపినట్లు మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ట్రుడేవ్ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడడానికి కెనడా ఫైటర్ జెట్ విమానాలను గత సంవత్సరం పంపింది. ఒప్పందం ప్రకారం మార్చి 2016 వరకు కెనడా ఫైటర్ జెట్ విమానాలు ఇరాక్, సిరియాలో కొనసాగాల్సి ఉంది.

 

ఇటీవల లిబరల్ పార్టీ తరపున కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ట్రుడేవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన ట్రుడేవ్.. ఐఎస్ఐఎస్ కు
వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ఫైటర్ జెట్ల ఉపసంహరణ నిర్ణయం ఎప్పటి నుండి అమలులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ట్రుడేవ్ ప్రకటించలేదు. ఉత్తర ఇరాక్లో కుర్ధులకు మద్దతుగా తమ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు