కరోనా బారిన ఆ దేశ ప్రధాని భార్య..

13 Mar, 2020 08:03 IST|Sakshi

టొరంటో : అంతర్జాతీయ మహమ్మారి కరోనావైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, తాజాగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో భార్య సోఫీ గ్రెగోర్‌కు కరోనావైరస్‌ పాజిటివ్‌గా రిపోర్ట్స్‌ వచ్చాయి. ట్రుడో దంపతులు ఓ కార్యక్రమంలో ప్రసంగించి వచ్చిన అనంతరం ట్రుడో భార్యకు ఫ్లూ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్‌గా తేలిందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ పేర్కొంది. భార్య  కరోనా బారినపడటంతో కెనడా ప్రధాని ట్రుడో తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కాగా ట్రుడోకు ఎలాంటి ఫ్లూ లక్షణాలు లేవని నిర్ధారించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని, ఇంటి నుంచే పనులు చక్కబెట్టాలని సూచించారు. ఇక కరోనావైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కెనడా అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా క్రీడా, వినోద ఈవెంట్లను రద్దు చేశారు.

చదవండి : నెల్లూరు యువకుడికి కరోనా

మరిన్ని వార్తలు