వాటికన్‌ చర్చి మతాధిపతిపై లైంగిక ఆరోపణలు

6 Oct, 2017 13:56 IST|Sakshi

కార్డినల్‌ జార్జ్‌ పెల్‌కు కఠిన పరిస్థితులు

జార్జ్‌ పెల్‌కు వ్యతిరేకంగా 50 మంది సాక్ష్యం

మెల్‌బోర్న్‌ : వాటికన్‌ సిటీ చర్చిలో ఉన్నత స్థాయి ప్రవక్త, ఆస్ట్రేలియాకు చెందిన మతాధిపతి (కార్డినల్‌) జార్జ్‌ పెల్‌పై నమోదైన లైంగిక ఆరోపణల కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. జార్జి పెల్‌పై నమోదైన లేంగిక వేధింపుల కేసులో ఇప్పటికే కోర్టు 50 మందిని విచారించింది. వీరంతా జార్జిపెల్‌కు వ్యతిరేకంగానే కోర్టులో సాక్ష్యం చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం కార్డినల్‌ జార్జి పెల్‌.. పోప్‌ ఫ్రాన్సిస్‌కు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న 76 ఏళ్ల జార్జ్‌ పెల్‌పై స్థానికంగా చాలా కాలం నుంచి లైంగిక వేధింపులు, అత్యాచార ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మెల్‌బోర్న్‌ కోర్టు మార్చి 5 నుంచి ఆయన విచారణ చేపట్టింది.

సుదీర్ఘంగా సాగుతున్న విచారణలో ఇప్పటివరకూ 50 మందిని విచారించినట్లు మెజిస్ట్రేట్‌ బెలిండా వెల్లింగ్టన్‌ పేర్కొన్నారు. ఇందులో 5 మంది మినహా మిగిలిన వారంతా జార్జ్‌ పెల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచినట్లు మెజిస్ట్రేట్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం జరిగిన కోర్టు విచారణకు జార్జ్‌ పెల్‌ వ్యక్తిగతంగా హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై విశ్వాసముందని ఆయన చెప్పారు. ఈ కేసును ఎదుర్కోవడం కోసమే.. పోప్‌ ఆర్థిక సలహాదారు పదవిని వదులుకున్నానని చెప్పారు.

మరిన్ని వార్తలు