ఇంటి డిజైన్‌ కాపీ కొట్టినందుకు..

8 Oct, 2017 02:32 IST|Sakshi

కాపీ కొట్టడం అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది పరీక్షలే. ఇక మనలో కొందరు వారికి నచ్చిన సినిమా హీరో, హీరోయిన్‌ డ్రెస్‌లు, హెయిర్‌ స్ట యిల్‌లను కూడా కాపీ కొడుతుంటారు. అసలు విషయాని కి వస్తే కెనడాలో ని టొరంటోలో ని ఫారెస్ట్‌ హిల్‌ ప్రాంతంలో నివసించే బార్బరా, ఎరిక్‌ క్రిషెన్‌బ్లాట్‌లు మూడేళ్ల క్రితం ఆర్కిటెక్ట్‌ను పిలిచి తమ పక్కింటి మాదిరిగా తమ ఇంటిని ఆధునీకరించాలని కోరారు.

చెప్పిందే తడవుగా ఆర్కిటెక్ట్‌ అచ్చం పక్కింటి ఇంటిని పోలినట్లుగానే కిటికీలు, చిమ్నీలు, తలుపులు, డిజైన్‌లతో తన పని పూర్తి చేశాడు. అనంతరం బార్బరా, ఎరిక్‌లు ఆ ఇంటిని 3.5 మిలియన్లకు విక్రయించారు. ఇది ఆ ఇంటిని ఆధునీకరించక ముందు ఉన్న విలువ కంటే 2 మిలియన్‌ డాలర్లు ఎక్కువ. సరిగ్గా ఇక్కడే తమ ఇంటిని కాపీ కొట్టడమే కాక ఎక్కువ ధరకు అమ్ముతారా.. అని ఆగ్రహించిన పక్కింటి జాసన్, జోడీ చాప్‌నిక్‌లు వారిపై కోర్టులో కేసు వేశారు.

తమ ఇంటిని అన్ని రకాలుగా కాపీ కొట్టినందుకుగాను 2.5 మిలియన్‌ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని పిటిషన్‌లో కోరారు. అయితే కొంతకాలం తర్వాత ఈ విషయాన్ని కోర్టు బయట పరిష్కరించుకుందామని ఇరు వర్గాలు అంగీకారానికి రావడంతో ఈ సమస్య కొలిక్కి వచ్చింది.

మరిన్ని వార్తలు