రోజుకు పది లక్షల పక్షుల బలి 

8 Oct, 2017 01:18 IST|Sakshi

పిల్లులు పక్షుల్ని చంపుకుతింటాయనే విషయం తెలిసిందే. కానీ ఆస్ట్రేలియాలో పిల్లులకు రోజుకు పది లక్షల పక్షులు బలవుతున్నాయనే విషయం తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. ఆస్ట్రేలియా బయోలాజికల్‌ కన్జర్వేషన్‌ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం... అడవి పిల్లుల బారిన పడి ఏడాదికి 316 మిలియన్‌ పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇక పెంపుడు పిల్లులకు 61 మిలియన్‌ పక్షులు ఆహారంగా మారుతున్నాయి. ‘పిల్లులు పక్షులను చంపుతాయనే విషయం తెలుసు. కానీ ఇంత భారీస్థాయిలో ఈ విధ్వంసం జరుగుతోందనే విషయం ఆందోళన కలిగించేదే.

ఇదిలాగే కొనసాగితే చాలా పక్షుల జాతులు అంతరించిపోయే ప్రమాదముంది’అని చార్లెస్‌ డార్విన్‌ యూనివర్సిటీ పరిశోధకుడు వొయినార్‌స్కి అభిప్రాయపడ్డారు. దాదాపు వందకు పైగా అధ్యయనాల ఫలితాలను క్రోడీకరించి, ఈ నిర్ణయానికి వచ్చామని, పిల్లుల సంఖ్యను తగ్గించడం ద్వారా జీవావరణంలో సమతుల్యతను కాపాడవచ్చని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కోట్ల సంఖ్యలో ఉన్న పిల్లులకు ఆహారంగా పక్షులు మినహా మరేమీ లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు