పెంపుడు జంతువుకు కరోనా సోకింది

14 May, 2020 13:38 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు అనేక మంది మరణించారు. ఇంకా చాలా మంది ఈ వైరస్‌ సోకి చికిత్స తీసుకుంటూ ఆసుపత్రిలో ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ భయపెడుతున్నాయి. అయితే కరోనా వైరస్‌ పిల్లులకు కూడా సోకుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. న్యూ లాబ్‌రేటోరి ఎక్స్‌పరిమెంట్‌ ప్రకారం కోవిడ్‌-19 వ్యాధిని కలిగించే సార్స్‌- కో వి-2 వైరస్‌ పిల్లులను కూడా ప్రభావితం చేస్తోందని పేర్కొంది. 

న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసెన్‌లో ముద్రించబడిన స్టడీ ప్రకారం వైరస్‌ సోకిన పిల్లులలో లక్షణాలు ఏమి కనిపించడం లేదని పేర్కొన్నారు. తరువాత ఆ వైరస్‌ పోతుందని తెలిపారు. మనుషుల నుంచి మాత్రమే ఇప్పటి వరకు ఇతర మనుషులకు ఈ వైరస్‌ సోకుతుందని ఆ జర్నలో పేర్కొన్నారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్లు ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు దొరకలేదన్నారు.పాతోబయోలాజికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ యోషిహోరో కవోకా మాట్లాడుతూ వైరస్‌ సోకిన పిల్లులను మనుషుల నుంచి దూరంగా ఉంచామని, అయితే తరువాత రోజు మాత్రం వాటి నాశిక ద్వారా మరో రెండు పిల్లులకు వైరస్‌ సోకినట్లు పేర్కొన్నారు. తరువాత మూడు రోజులకి అక్కడ ఉన్న పిల్లులన్నింటికి ఈ వైరస్‌ సోకిందన్నారు. తరువాత వీటిని వేరే చోట ఉంచితే మొత్తం ఆరు రోజుల్లో అక్కడ ఉన్న పిల్లులన్నింటినికి కరోనా వైరస్‌ సోకింది. 

ఈ స్టడీ మాత్రమే కాకుండా వేరే పరిశీలనలకు కూడా పిల్లులు ద్వారా వైరస్‌ వ్యాపించి చెందుతుందని పేర్కొన్నాయి. అయితే కరోనా వైరస్‌ సోకి ఐసోలేషన్‌లో ఉ‍న్న వారు కేవలం వారి కుటుంబ సభ్యలకు, ఇతర మానవులకు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు